Vangalapudi Anitha vs YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేసి జగన్ అతని గొయ్యి అతనే తవ్వుకున్నారన్నారు. ఎవరిని టచ్ చేయకూడదో జగన్ వాళ్లనే టచ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును క్రూరంగా హింసించారని మంత్రి విమర్శించారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఉప్పుటేరు వంతెన వద్ద హోంమంత్రి అనితకు ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి భారత్ ఘన స్వాగతం పలికారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు.
Also Read: YS Jagan: గవర్నర్‌తో వైఎస్ జగన్ దంపతుల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!
‘వైఎస్ జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు. జగన్ ఎవరిని టచ్ చేయకూడదో వాళ్లనే టచ్ చేశారు. ఎవరైనా ఇది తప్పు అని అడిగితే అది సరిచేసుకోవాలి లేదా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఈ రెండు కాకుండా నువ్వు అడిగితే కేసు పెడతా, గట్టిగా మాట్లాడితే జైలుకు పంపిస్తా అన్నట్లు వ్యవహరించారు. సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును క్రూరంగా హింసించారు. రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేం ఉన్నాం అని ధైర్యం ఇచ్చారు. ఓటు వేసిన తరువాత ప్రజల పట్ల నాయకుడికి భాద్యత, జవాబుదారీతనం ఉండాలి. ఈరోజు మేము అంతా జవాబుదారీతనంతో ఉన్నాం. నేను ఓట్లు అడిగేందుకు రాలేదు. ఆకివీడు ప్రజలకు ఏం కావాల్లో అడిగేందుకు వచ్చా. నా పర్యటనకు చెట్లు కొట్టాల్సిన పని లేదు, షాపులు కట్టక్కర్లేదు, పరదాలు అవసరం లేదు. నా అజెండా అభివృద్ధి, సంక్షేమే.. పగలు ప్రతీకారాలు కాదు’ అని హోంమంత్రి అనిత చెప్పారు.
వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి పాలనలో కూటమి ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తోంది. ఏడాది పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా… pic.twitter.com/ed752ZghVH
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 28, 2025