Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Vandemataram In Ethiopia Pm Modi Delighted During Cultural Event Video Goes Viral

PM Modi: ఇథియోపియాలో ‘వందేమాతరం’.. పిల్లాడిలా మారిపోయిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

Published Date :December 17, 2025 , 1:58 pm
By Kothuru Ram Kumar
  • ప్రత్యేక విందులో సాంస్కృతిక కార్యక్రమం
  • ఇథియోపియా కళాకారులు భారత జాతీయ గీతం “వందేమాతరం”ను ఆలాపన.
  • వందేమాతరం ఆలాపనను ఆస్వాదించిన ప్రధాని మోదీ
  • చిన్న పిల్లాడిలా చప్పట్లు కొడుతూ ఆనందంతో స్పందన.
  • అభినందించిన మోదీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌.
PM Modi: ఇథియోపియాలో ‘వందేమాతరం’.. పిల్లాడిలా మారిపోయిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన సాంస్కృతిక ఆత్మీయతతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా నిలిచింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు అడిస్ అబాబాకు చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇథియోపియా కళాకారులు భారత జాతీయగీతం “వందేమాతరం”ను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

PM Modi: “వసుధైక కుటుంబానికి భారత్‌ కట్టుబడి ఉంది”.. ఇథియోపియా పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం..

మంగళవారం నాడు అడిస్ అబాబా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీని స్వయంగా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ స్వాగతించారు. అంతేకాదు.. ఆయన స్వయంగా వాహనం నడుపుతూ మోదీని హోటల్‌కు తీసుకెళ్లడం అరుదైన ఘటనగా నిలిచింది. మంగళవారం సాయంత్రం ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా మారింది. భోజన కార్యక్రమానికి తోడు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలో ఇథియోపియా కళాకారులు “వందేమాతరం”ను మనసుకు హత్తుకునేలా ఆలపించారు. ఈ ప్రదర్శనను ఆస్వాదించిన ప్రధాని మోదీ కళాకారులను చప్పట్లతో అభినందించారు. ఆ సందర్భంలో అచ్చం ఓ పిల్లడు ఎలా ఆనందాన్ని ఆస్వాదిస్తాడో అలా ఆ క్షణాలను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Pakistan-BLA: పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ (X) ఖాతాలో స్పందిస్తూ.. “నిన్న ప్రధాని అబియ్ అహ్మద్ అలీ నిర్వహించిన విందులో ఇథియోపియా గాయకులు వందేమాతరం అద్భుతంగా పాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ అనుభూతి మరింత భావోద్వేగంగా మారిందని పేర్కొన్నారు. ఆ ప్రదర్శన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. గత 11 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్, ఆఫ్రికా సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఆఫ్రికా దేశాలతో దౌత్య, అభివృద్ధి సంబంధాలు మరింత వేగం పుంజుకున్నాయి.

At yesterday’s banquet dinner hosted by Prime Minister Abiy Ahmed Ali, a wonderful rendition of Vande Mataram was sung by Ethiopian singers. It was a deeply moving moment, that too at a time when we are marking 150 years of Vande Mataram. @AbiyAhmedAli pic.twitter.com/TeHbPzBBLb

— Narendra Modi (@narendramodi) December 17, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abiy Ahmed Modi meeting
  • Ethiopia
  • India Ethiopia relations
  • Narendra Modi
  • PM Modi

తాజావార్తలు

  • Trump: ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాం.. ఫేక్ మీడియా హైలెట్ చేయలేదు.. ట్రంప్ ధ్వజం

  • India Defense New Weapons: రక్షణ వ్యవస్థలోకి భారీగా కొత్త ఆయుధాలు.. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన కీలక మార్పులు ఇవే..!

  • 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

  • NTRNeel : ఎన్టీఆర్ – నీల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫాన్స్ కు షాక్..

  • Tilak Varma: తొలి 19 బంతుల్లో 0.. తర్వాతి 23 బంతుల్లో విధ్వంసం.. తిలక్ బ్యాటింగ్ సాగిందిలా!

ట్రెండింగ్‌

  • Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions