Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించింది.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పక్షపాతంగా జరుగుతున్నాయి అని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. కృష్ణా జిల్లా: గన్నవరం స్థానిక జడ్పీ హైస్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న వంశీ.. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు పక్షపాత ధోరణితో జరుగుతున్నాయని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు వల్లభనేని వంశీ. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఆ హామీలన్నీ కేవలం మాటలకే పరిమితమయ్యాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని వంశీ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా అధికార పార్టీ అడ్డుకుంటోందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..
Also Read
- Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
- Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
- CM Revanth Reddy: "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి".. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న కార్యక్రమం..
- AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
-
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
-
SS Rajamouli Reviews Ramayana: ‘రామాయణ’పై రాజమౌళి రివ్యూ వైరల్! ఏమన్నారంటే?
-
Ramayana : రణబీర్‌ను డామినేట్ చేసిన యష్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
ట్రెండింగ్
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!