రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 100 మందితో పట్టపగలు యువకులతో వెళ్లి ఇంట్లో వైశాలి అనే యువతిని మిస్టర్ టీ షాప్ ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేయడంతో ఈసంఘటన సంచలనంగా మారింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైశాలితో తను ప్రేమలో ఉన్నానని తెలిపిన నవీన్ రెడ్డి.. ‘హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. మా వివాహం 2021 ఆగస్టు 4న బాపట్ల జిల్లా వలపర్ల దేవాలయంలో జరిగింది. బిడిఎస్ వరకు పెళ్లి ఫోటోలు బయటకు రాకూడదని వైశాలి కండిషన్ పెట్టిందని, మేము జనవరి 2021 నుండి ప్రేమలో ఉన్నామన్నాడు. అంతేకాకుండా.. వైశాలి కుటుంబ సభ్యులు నాతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు నవీన్.
Also Read : Cyclone Mandous: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. సముద్రంలో చిక్కుకున్న మరబోటు
తన చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటామంటూ వైశాలి తల్లిదండ్రులు ఇచ్చిన మాటను తప్పారని చెప్పుకొచ్చాడు నవీన్. నా డబ్బుతో వైజాగ్, అరకు, వంజంగి, కూర్గ్, మంగళూరు, గోకర్ణ, గోవా వెళ్ళానని, నేను వైశాలి పేరు మీద వోల్వో, వైశాలి తండ్రికి రెండు కాఫీ షాప్‌లు రిజిస్టర్ చేయించాను అని కి నవీన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కిడ్నాప్ కేసులో 31 మందిని ఎస్వీటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కిడ్నాప్ కేసులో నిందితులు ఆదిభట్ల పీఎస్ కు తరలించారు పోలీసులు. 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారిలో ఎక్కువమంది మిస్టర్ టీషాప్ లో పనిచేసే వర్కర్లేనని వెల్లడించారు. అయితే.. వైశాలిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.