సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న పేరు ‘వైభవ్ సూర్యవంశీ’. ఇందుకు కారణం మెరుపు సెంచరీ చేయడమే. ఐపీఎల్ 2025లో సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వైభవ్ విధ్వంసంతో రాజస్థాన్ 15.5 ఓవర్లలోనే 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఈ ప్రశంసలు తన కంటే ఎక్కువగా తన అమ్మానాన్నలకే చెందుతాయని చెప్పాడు. అమ్మానాన్నలు తన కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పాడు.
Also Read: MISS WORLD-2025: మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
‘ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణం అమ్మానాన్నలే. నా కోసం మా అమ్మ తెల్లవారుజామునే నిద్ర లేచేవారు. నా ప్రాక్టీస్ కోసం ఆహారం సిద్ధం చేసి ఇచ్చేవారు. అమ్మ మూడు గంటలు మాత్రమే నిద్ర పోయేవారు. నా కోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు. నిత్యం నా వెంటే ఉన్నారు. కుటుంబం కోసం అన్నయ్య పని చేయడం మొదలుపెట్టాడు. మేము ఎన్నో కష్టాలు పడ్డాం. ఏ సందర్భమైనా మా నాన్న నాకు అండగా నిలిచేవారు. ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలని అనే వారు. ఆ దేవుడి దయవల్ల ఫలితం తొందరగానే వచ్చింది. ఈ విజయం కేవలం మా అమ్మానాన్న వల్లే వచ్చింది. వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు’ అని మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.