Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ప్రతిభకు కొదవలేదు, కానీ ఆ ప్రతిభ అంతర్జాతీయ వేదికపైకి రావడానికి సరైన సమయం కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ చర్చ ఈనాటిది కాదు. గతంలో సంజూ శామ్సన్ విషయంలోనూ సరిగ్గా ఇలాంటి చర్చే నడిచింది. అప్పుడు అప్పటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ చేసిన వ్యాఖ్యలను పోల్చి చూస్తే భారత క్రికెట్ నడిచే పక్కా సిద్ధాంతం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది.
గతంలో టీ20 ప్రపంచకప్ సమయంలో భారత ఓపెనింగ్ జోడీ తడబడుతున్నప్పుడు.. ఐపీఎల్లో అదరగొట్టిన సంజూ శామ్సన్ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలంటూ అభిమానుల నుంచి భారీ డిమాండ్ వచ్చింది. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను దీనిపై ప్రశ్నించగా, ఎంతో ప్రాక్టికల్ గా సమాధానమిస్తూ “శామ్సన్ను ఆడించాలంటే ప్రస్తుతం జట్టులో ఉన్న ఏ సీనియర్ లేదా స్థిరపడిన బ్యాటర్‌ను పక్కనబెట్టాలో మీరే చెప్పండి?” అని ఎదురు ప్రశ్నించాడు. అంటే ఒకరిని జట్టులోకి తేవడం కోసం బాగా ఆడుతున్న లేదా నమ్మకమైన మరొక ఆటగాడిని తీసేయడం అంత సులువు కాదనేది సూర్య మాటల అంతరార్థం.
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
కట్ చేస్తే.. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌లో టీమిండియా ఘోరంగా విఫలమై వైట్‌వాష్ అయినప్పటికీ, 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన రికార్డ్ బ్రేకర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు. దీనిపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ను ప్రశ్నించగా.. ఆయన ఆనాడు సూర్యకుమార్ చెప్పిన మాటలనే మరో రూపంలో చెప్పారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వంద శాతం సిద్ధంగా ఉన్నాడని అంగీకరిస్తూనే, కేవలం అతని కోసం మూడు నెలల క్రితమే భారత్‌కు ప్రపంచకప్ గెలిపించిన సంజూ శామ్సన్ను ఎలా పక్కనబెడతామని ప్రశ్నించారు. ఆటగాళ్లకు తాము ఇచ్చే మెసేజ్ ఒక్కటేనని.. తమపై మేనేజ్మెంట్కు పూర్తి నమ్మకం ఉందని, అందుకే వారికి ఎక్కువ అవకాశాలు ఇస్తామని చెప్తూ, వైభవ్ కూడా మిగతా వారిలాగే తన సమయం వచ్చే వరకు ఓపిక పట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆనాడు ఎవరి కోసమైతే జట్టులోని ఇతరులను తీసేయలేమని సూర్యకుమార్ అన్నారో, ఈనాడు అదే సంజూ శామ్సన్ స్థానాన్ని మార్చలేం కాబట్టే వైభవ్ సూర్యవంశీ లాంటి యువ సంచలనానికి చోటు ఇవ్వలేకపోతున్నామని కోచ్ చెప్తున్నారు!
తాజావార్తలు
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!