Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi Saree Look: ‘రామాయణ’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో సాయి పల్లివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సింపుల్, పద్ధతైన రూపంతో అందరి మనసులను గెలుచుకుంది. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణ’ మొదటి భాగం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
దీపావళికి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం అక్టోబర్ 15వ తేదీన బెంగళూరులో అంతర్జాతీయ ట్రైలర్ లాంచ్ వేడుకతో ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది. ఈ వేడుకలో దర్శకుడు నితీశ్ తివారీ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌తో పాటు రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, యష్ తదితరులు పాల్గొన్నారు. ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎప్పుడూ తన సహజసిద్ధమైన అందంతో ఆకట్టుకునే సాయి పల్లవి మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read
- TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఇంగ్లీష్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సాయి పల్లవి ఎప్పటిలాగే అత్యంత సాదాసీదాగా కనిపించి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ వేడుకలో ఆమె లేత గులాబీ రంగు సిల్క్ చీరలో అచ్చం రాజకుమారిలా మెరిసిపోయింది. ఈ గులాబీ రంగు టిష్యూ సిల్క్ చీరపై వెండి రంగు జర్దోజీ ఎంబ్రాయిడరీ, అందమైన మోటిఫ్స్, జరీ పనితనం చీరకు ప్రత్యేక అందాన్ని తెచ్చాయి. చీర అంచులపై ఉన్న ఆకర్షణీయమైన డిజైన్ ఆమె రూపానికి ఒక రాచరికపు శైలిని అందించింది. ఈ చీరకు సరిపోయేలా షార్ట్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ ధరించి ఎంతో హుందాగా కనిపించింది. సహజమైన సౌందర్యానికి మారుపేరైన సాయి పల్లవి ఈ ఈవెంట్లో చాలా తక్కువ అలంకరణతో కనిపించింది. చెవులకు బంగారు రంగు గుండ్రటి రింగులు, ఒక చేతికి గాజులు, కడా, మరో చేతిలో చిన్న చైన్ ధరించింది. తన సహజమైన కురులను సాఫ్ట్ వేవ్స్‌తో హాఫ్ ఓపెన్ హెయిర్‌స్టైల్‌లో ఉంచింది. ఈ వేడుకలో ఆమె తన సహనటులందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..