Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో 776 పరుగులు, 237+ స్ట్రైక్ రేట్, 72 సిక్సర్లు బాది ఆరెంజ్ క్యాప్‌తో పాటు 5 అవార్డులు గెలుచుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంట్రీపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ నడుస్తోంది. బుమ్రా, కమిన్స్ లాంటి బౌలర్లను సైతం ఊచకోత కోసిన వైభవ్‌ను నెట్స్‌లో ఎదుర్కోవడానికే భయపడతానని తోటి ఆటగాడు జోఫ్రా ఆర్చర్ అనడం, అలాగే సచిన్, కోహ్లీ, గిల్, అజయ్ జడేజాల ప్రశంసలు అతని రేంజ్‌ను చెప్తున్నాయి. అయితే.. వైభవ్ జట్టులోకి వస్తే 2026 మార్చి 8న అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ప్రస్తుత టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఎవరిని తీసేస్తారు? అనేది ఇప్పుడు ప్రశ్న. 2027 వరల్డ్ కప్ వరకు వన్డేల్లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా స్థిరపడ్డారు కాబట్టి, వైభవ్ టీ20 ఎంట్రీ లేదా వన్డేల్లో బ్యాకప్ ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ టీ20ల్లో ఓపెనర్‌గా రావాలంటే.. వరల్డ్ కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా, టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచి, కీపర్‌గా ఉన్న సంజు శాంసన్‌ను గానీ, లేదా వరల్డ్ కప్‌లో విఫలమైనా.. ఫైనల్లో 21 బంతుల్లో 52 రన్స్ చేసి, ప్రస్తుతం ఐసీసీ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా ఉంటూ, ఇటీవలి ఐపీఎల్లో 563 రన్స్ చేసిన అభిషేక్ శర్మను గానీ పక్కన పెట్టాలి.
ఈ నేపథ్యంలో శనివారం ముంబైలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలో జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశం అత్యంత కీలకం కానుంది. ఇందులో జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్లో జరిగే ఐర్లాండ్ సిరీస్‌తో పాటు జూలైలో ఇంగ్లాండ్ టూర్, సెప్టెంబర్-అక్టోబర్‌లో జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ స్క్వాడ్‌ను ఎంపిక చేయనున్నారు. ఒకవేళ వైభవ్ గనుక జూన్ ఐర్లాండ్ సిరీస్‌లోనే ఎంపికైతే… సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి, భారతదేశం తరఫున అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. ఒకవేళ ఐర్లాండ్ కాకపోతే, ఐఓఏ (IOA)కి బీసీసీఐ పంపిన 30 మంది ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ పేరు ఉంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే వెస్టిండీస్ పర్యటన, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే ఏషియన్ గేమ్స్ ఒకే సమయంలో ఉండటంతో సెలెక్టర్లు రెండు వేర్వేరు టీ20 జట్లను ఎంపిక చేయాల్సి వస్తోంది. వన్డే కెప్టెన్సీ బాధ్యతల వల్ల గిల్‌తో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌లకు ఏషియన్ గేమ్స్ లిస్టులో చోటు దక్కలేదు కాబట్టి, వైభవ్ నేరుగా ఏషియన్ గేమ్స్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్లోకి లాంచ్ అయ్యే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో భారత క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలవ్వడం ఖాయం, కానీ అదే సమయంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టు నుంచి ఎవరు త్యాగం చేయాల్సి వస్తుందనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది!
Also Read
- World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
- JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
తాజావార్తలు
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!