Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీకి షాక్.. ఇకపై ఆడేందుకు నో ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. రాబోయే మరికొన్ని ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపించే పేరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం కేవలం అతడి ఆట తీరు. అండర్-19 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచానికి తన సత్తా ఏంటో రుచి చూపించాడు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ ను ఆరోసారి అండర్-19 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపి అనేక అరుదైన రికార్డులను సృష్టించాడు.
T20 World Cup 2026: ప్రపంచ కప్‌లో నవ్వుల పాలు కాకుండా బయటపడ్డ పాక్..
Also Read
ఫైనల్లో సెంచరీ చేసిన మూడవ భారతీయ ఆటగాడిగా నిలిచిన వైభవ్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులను ఒకేసారి అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా.. అతనికి ఇంకా వయస్సు ఉన్న.. ఇకపై అండర్-19 ప్రపంచ కప్‌లో కనిపించడు. దీనికి కారణం.. మార్చి 27, 2011న జన్మించిన వైభవ్ వయస్సు పరంగా చూస్తే 2030 అండర్-19 ప్రపంచ కప్ వరకు అర్హత ఉంది. కానీ బీసీసీఐ (BCCI) అమలు చేస్తున్న నియమాల కారణంగా మరో ఎడిషన్‌లో ఆడే అవకాశం ఉండదు.
IND vs USA: టీమిండియా ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. స్టార్ బౌలర్ అవుట్!
2016లో బీసీసీఐ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. భారత్ తరపున ఒకసారి అండర్-19 ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆటగాడు వయస్సు పరంగా అర్హత ఉన్నప్పటికీ మళ్లీ ఆ టోర్నమెంట్లో ఆడకూడదు. అలాగే అండర్-19 లోకి వచ్చిన ఆటగాళ్లు గరిష్టంగా రెండు సీజన్లు మాత్రమే అండర్-19 క్రికెట్ ఆడేలా నిబంధనలు రూపొందించారు. గతంలో వయస్సు మోసాలకు సంబంధించిన సమస్యలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రూల్ కు ముందు రవీంద్ర జడేజా, విజయ్ జోల్, అవేష్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, రికీ భూయ్ వంటి ఆటగాళ్లు రెండు అండర్-19 ప్రపంచ కప్‌లలో పాల్గొన్నారు. కాబట్టి ఈ బీహార్ డైనమేట్ ఇకపై అండర్-19 వరల్డ్ కప్ లో పాల్గొనలేడు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..