Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య దంబుల్లా వేదికగా జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అభిమానులను నిరాశపరిచాడు. ఇటీవలి కాలంలో అదిరిపోయే ఫామ్‌లో ఉన్న వైభవ్ ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ కేవలం 14 పరుగులకే అతడి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలో వైభవ్ సూర్యవంశీ కొన్ని ఆకర్షణీయమైన షాట్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. 12 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసినప్పటికీ.. లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. శ్రీలంక ‘ఎ’ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షిరాజ్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరీకి వైభవ్ పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ నాలుగో బంతికి క్రీజులోనే ఉండి స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బంతి సరిగ్గా కనెక్ట్ కాక మిడ్-ఆఫ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళింది. వైభవ్ అవుట్ కాగానే లంక ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు.
ఇక ఈ మ్యాచ్‌తో భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ (15 ఏళ్ల 71 రోజుల) రికార్డు సృష్టించాడు. సుదీర్ఘకాలంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ఈ బాలుడు బద్దలు కొట్టాడు. సచిన్ 1989లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ.. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన సచిన్ రికార్డు బద్దలు గొట్టిన వైభవ్.. ఓ మార్కును మాత్రం దాటలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ పాకిస్థాన్‌తో ప్రారంభమైంది. వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు బరిలోకి దిగాడు. కరాచీ టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సచిన్ క్రీజులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 15 పరుగులు (24 బంతుల్లో, 2 ఫోర్లు) చేశాడు. విశేషం ఏంటంటే.. తొలి మ్యాచ్‌లో సచిన్ 15 పరుగులు చేయగా.. వైభవ్ మాత్రం 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగుతో సచిన్ ముందంజలో ఉన్నాడు. కానీ.. ఇక్కడ మరో విషయం గమనించాలి. సచిన్ టెస్ట్ సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వగా.. వైభవ్ మాత్రం వన్డే సిరీస్‌తో అరంగేట్రం చేశాడు.
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..