టమోటా ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. మొన్నటివరకు పది రూపాయాలు పలికే టమోటా.. నేడు మార్కెట్ లో కిలో వచ్చి రూ.150 పలుకుతుంది.. ఎన్నడూ చూడని ధరలు, ఎప్పుడూ కొనుగోలు చేయని రేట్లకు టమాటాలు విక్రయిస్తుంటే జనం వాటిని కొనాలంటేనే ముందు, వెనుక ఆలోచిస్తున్నారు.. దాదాపు చాలా ప్రాంతాల్లో టమోటాల తో తయారు చేసె అన్నీ వంటలు ఒక్కోటిగా కనుమరుగు అవుతున్నాయి.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూరగాయల దుకాణాల్లో టమాటాలు చోరీకి కూడా గురవుతున్నాయి. అంతేందుకు టమోటాలను తోటల నుంచి తీసుకెళ్తున్నారు.. ఇటీవల ఇలాంటి చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి..
అందుకే టమాటా వ్యాపారులు తమ దుకాణాల్లో టమాటాలు చోరీకి గురి కాకుండా కస్టమర్లను నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఓ ప్రాంతంలో కూరగాయల వ్యాపారి వినూత్న ఆలోచన చేశాడు.. ఏకంగా టమోటాలకు సెక్యూరిటీగా బౌన్సర్లను పెట్టుకున్నాడు.. ఇందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..ఇదేంటని అడిగితే కస్టమర్లు టమాటాలు చోరీకి పాల్పడుతున్నారని..లేదంటే టమాటాల కోసం తోపులాట జరుగుతోందని ..అందుకే బౌన్సర్లను నియమించుకున్నట్లుగా తెలిపాడు..
ఈ విచిత్ర ఘటన ఎక్కడో కాదు మన దేశంలోనే.. ఉత్తరప్రదేశ్ వారణాసి లో ఓ కూరగాయల దుకాణం దగ్గర వ్యాపారి బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు.. ప్రస్తుతం దేశంలో టమాటా ధరల పెరుగుదల చూస్తుంటే కిలో వందలు దాటి వెయ్యి రూపాయలకు చేరుకునే పరిస్తితి వచ్చేలా కనిపిస్తోంది. ఆదిత్య 369 అనే తెలుగు సినిమాలో చూపించినట్లుగా టమాటా ధరలు ప్రజలకు మతిపోగొడుతున్నాయి. అయితే కూరల్లో తప్పని సరిగా వాడే పండు కావడంతో .. ధర పెరిగినప్పటికి కొనుగోలు చేయక తప్పడం లేదు. అయితే అంతపెద్ద మొత్తంలో కాకుండా కొద్దిగా అయినా వాడుతున్నారు.. పబ్‌లు, సెలబ్రిటీ ఈవెంట్‌లు, లేదంటే వీఐపీల కు రక్షణగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే వారణాసిలో కూరగాయల వ్యాపారి కొద్ది రోజులుగా బౌన్సర్లను నియమించడం చర్చనీయాంశమైంది.. ఇలాంటివి చూసైన ధరలను తగ్గించే ప్రయత్నం చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు..
VIDEO | A vegetable vendor in Varanasi, UP has hired bouncers to keep customers at bay when they come to buy tomatoes, whose price has increased massively over the past few days. “I have hired bouncers because the tomato price is too high. People are indulging in violence and… pic.twitter.com/qLpO86i9Ux
— Press Trust of India (@PTI_News) July 9, 2023