Uttam Kumar Reddy: కల్పిత విషయాలతో ప్రచారం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ బీజేపీ.. కలిసి మా ప్రభుత్వం పై అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని, కల్పిత విషయాలతో ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారు చేసే ప్రచారంలో నయా పైసా నిజం లేదని ఆయన అన్నారు. మేము అధికారంలోకి వచ్చాక సమీక్ష చేస్తే.. అస్తవ్యస్త పరిస్థితి అని, సివిల్ సప్లై లాసులు 11 వేళా కోట్లు అని ఆయన అన్నారు. రైస్ మిల్లుల దగ్గర ధాన్యం 20 వేళా కోట్ల ధాన్యం వదిలేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం నేతలు అని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయం లో గత పాలకుల కంటే కొనుగోలు ముందు మొదలు పెట్టాం.. డబ్బులు వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చూశామని, తాలు.. తరుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. . వీలైనంత వరకు తాలు..తరుగు తగ్గించామని, . 10 శాతం తాలు తరుగు తీస్తున్నారు అని ఓ పెద్ద మనిషి అంటారన్నారు. వెయ్యి కోట్లు నేను తీసుకున్న అట అని, ఇంత నిచపు మాటలు మానుకోవాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తాను రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూల్ చేస్తు్న్నానంటూ బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీభవన్లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినతిపత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి.. లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్మెంట్ విషయాలు మాట్లాడినట్లు కాదని మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సచివాలయానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక, బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్టు ఉన్నారని అన్నారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి నీచపు మాటలు మానుకోవాలని చురకలంటించారు. ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతి బీజేపీకి ఉందని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.200 కోట్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని, అలాంటిది ధాన్యం కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని మంత్రి ప్రశ్నించారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డినని.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోనని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని, రూ.11 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..