Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Salian Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా మరణం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2020లో ముంబైలోని ఓ హై రైజ్ భవనం నుంచి కిందపడటంతో దిశా మృతి చెందారు. అప్పట్లో పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసులో ఫౌల్ ప్లేకు ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే దిశా తండ్రి సతీష్ సాలియన్ మాత్రం తన కుమార్తె మరణంపై అనేక సందేహాలు ఉన్నాయని, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు దర్యాప్తు తీరుకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
2026 ఆగస్టు 28న జరిగిన విచారణ సందర్భంగా దిశా మృతదేహానికి సంబంధించిన వైద్య, పోలీసు రికార్డులపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ముంబై పోలీసుల దర్యాప్తు తీరుపై బొంబాయి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. 2026 ఆగస్టు 28న జరిగిన విచారణలో భాగంగా, 14వ అంతస్తు నుంచి కిందపడిన వ్యక్తి తల భాగంలో ఎలాంటి ఫ్రాక్చర్లు కాకపోవడం, అలాగే మృతదేహం పడివున్న ప్రదేశంలో రక్తపు మరకలు లేకపోవడంపై న్యాయస్థానం ముంబై పోలీసులను గట్టిగా ప్రశ్నించింది. అంతేకాకుండా, పోలీసుల ఇన్క్వెస్ట్ పంచనామా నివేదికలో మృతదేహంపై దుస్తులు లేవని పేర్కొనగా, ఆసుపత్రి మరియు శవాగారంలో తీసిన ఫోటోలలో మాత్రం దుస్తులు ఉండటంపై కోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఒకే ఘటనకు సంబంధించిన అధికారిక రికార్డుల్లో ఇలాంటి తేడాలు ఎందుకు వచ్చాయనే అంశంపై న్యాయస్థానం వివరణ కోరింది.
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ అయిన దిశా సాలిన్ 2020 జూన్ 8న మరణించగా, ముంబై పోలీసులు దీనిని ఆత్మహత్యగా తేల్చి కేసును ముగించారు. అయితే ఆమె తండ్రి సతీష్ సాలిన్ తన కుమార్తెపై అత్యాచారం, హత్య జరిగాయని ఆరోపిస్తూ, ఈ కేసును సీబీఐ (CBI) ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు వ్యక్తంచేసిన అనుమానాలతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పటికే జరిగిన దర్యాప్తును సమర్థించారు. సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డులను పరిశీలించినప్పటికీ ఫౌల్ ప్లేకు ఆధారాలు లభించలేదని వాదించారు. దిశా ప్రియుడు రోహన్ రాయ్ వాంగ్మూలంలో కూడా హత్యకు సంబంధించిన ఆధారాలు లేవని కోర్టుకు వివరించినట్లు సమాచారం.
దిశా సాలియన్ మరణం జరిగిన కొద్ది రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా మృతి చెందడంతో, ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. మొత్తంగా చూస్తే దిశా సాలియన్ మరణం కేసులో బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు తీరుపై మరోసారి చర్చకు దారితీశాయి. మరి ఈ మరణాల మిస్టరీ ఎప్పుడు వీడుతుందో, అసలు నిజాలు ఎప్పుడు బయటికి వస్తాయో అని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.
- Tags
- cinema
- disha salian case
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?