Uttam Kumar Reddy : మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDSA బృందం నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఎ నాలుగు నెలలు రిపోర్టు సమర్పిస్తామని తెలిపిందని, అంతకన్నా ముందే ప్రాథమిక రిపోర్ట్ వీలైనంత తొందరలో ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగా వెంటనే డాం రిపేర్ తో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ టిఆర్ఎస్ కు ఏటీఎంగా మారటానికి ప్రధాన కారణమే మోడీ ప్రభుత్వమని, కార్పొరేషన్ల ద్వారా 84 వేల కోట్ల రుణం అందించింది కేంద్రమే కదా అని ఆయన అన్నారు. మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేము కోరిన వెంటనే జలాశక్తి శాఖ కమిటీ వేసి పరిశీలనకు పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్ధరణకు చేయాల్సిన అంశంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మీ సలహాలను పాటించి మెడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామన్నారు. బ్యారేజి డ్యామేజ్ కి రీజన్స్ చెప్పాలన్నారు.
Viral Video : స్వచ్ఛమైన బంగారంతో పప్పు.. షాక్ అవుతున్న నెటిజన్స్…
Also Read
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
అంతేకాకుండా.. ‘సమస్యకు కారణం ఎవరు అనేది అడిగాం. వర్షాలు రాకముందే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. బ్యారేజీలు రిపెర్స్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..సాధ్యాసాధ్యాలు చెప్పండి. NDSA కమిటీకి పూర్తి సహకారం ఉంటుంది. ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్స్ NDSA కమిటీ కి ఇవ్వాలని కోరుతున్నాం. ఎవరైనా NDSA కమిటీ కి సహకారం ఇవ్వకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కటినమైన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే వచ్చినట్లు చెప్పిన కమిటీ. రేపు ఉదయం మెడిగడ్డ, అనంతరం అన్నారం, రేపు రాత్రి రామగుండం. 8న సుంధిల్ల బ్యారేజి విసిట్ ఉంటుంది. టెస్టుల కోసం ప్రపంచంలో ఎంత అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సుచించాం. రిపేర్ చేసి మళ్ళీ అందుబాటులోకి వస్తె రాష్ట్రానికి మంచిది. వర్షాకాలంకు ముందే అందుబాటులోకి వస్తె మరీ మంచిది. ENC నాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ విసిట్ పూర్తి చేసుకుంటుంది. NDSA ప్రాథమిక రిపోర్ట్ రాగానే తప్పులు ఉంటే నిర్మాణ సంస్థ పై చర్యలు తీసుకుంటాం. L AND T రాష్ట్రంలో అనేక వ్యాపారాలు చేస్తోంది. మేము చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం. నిర్మాణ సంస్థ కు భాధ్యత ఉండాలి. జుడిష్యల్ ఎంక్వైరీ పై త్వరలోనే ముందడుగు ఉంటుంది’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Janhvi Kapoor: పుట్టినరోజున చిన్నమ్మతో కలిసి తిరుపతిలో సందడి చేసిన దేవర బ్యూటీ..
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!