Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి.. తన అందాన్ని మొత్తం కూతుర్లకు ఇచ్చేసి.. ఆమె వెళ్ళిపోయింది. ఇక తల్లి అందాన్ని పుణికిపుచ్చుకున్న కూతుర్లు ఎప్పటికప్పుడు ఆమెను గుర్తుచేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఈ చిన్నదాన్ని హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడింది. కానీ, ఆ ముచ్చట తీరకుండానే శ్రీదేవి మృతి చెందింది. ఇక జాన్వీ కూడా తల్లి ఆశను నెరవేర్చడానికి నిత్యం కష్టపడుతూనే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం జాన్వీ పేరే మారుమ్రోగుతుంది. అందుకు కారం నేడు ఈ పుత్తడి బొమ్మ పుట్టినరోజు కాబట్టి. సోషల్ మీడియాలో అభిమానులు జాన్వీకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇక జాన్వీ అందాల ఆరబోత, పార్టీ కల్చర్ అనేది పక్కన పెడితే.. ఆమెకు దైవ భక్తి ఎక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా తిరుపతి అంటే జాన్వీకి ఎంతో ఇష్టం. నెలలో ఒక్కసారి అయినా జాన్వీ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోకుండా ఉండదు.
ఇక పిల్లల పుట్టినరోజున శ్రీదేవి.. ఎన్ని పనులు ఉన్నా కూడా వారిని ఉదయాన్నే గుడికి తీసుకొచ్చి పూజలు చేసి, దేవుని ఆశీర్వాదాలు అందించేదట. ఇక తల్లి లేకపోయినా ఆ ఆచారాన్ని జాన్వీ పాటిస్తుంది. నేడు తన పుట్టినరోజున ఉదయాన్నే ఆమె తిరుపతిలో సందడి చేసింది. శ్రీదేవి చెల్లెలు, సీనియర్ నటి మహేశ్వరి సైతం జాన్వీకి తోడుగా వచ్చింది. స్వామివారికి మొక్కులు చెల్లించి తీర్ధప్రసాదాలను అందుకున్నారు. ఇక లంగా ఓణీలో జాన్వీ అందం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎరుపు రంగు ఓణీలో జాన్వీ ఎంతో అందంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ.. దేవర, RC16 లో నటిస్తోంది.
శ్రీవారిపై శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌కు అమితమైన భక్తి. పుట్టినరోజు సందర్భంగా సమీప బంధువు, నాటి హీరోయిన్ మహేశ్వరి, స్నేహితులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. #JhanviKapoor #Tirumala pic.twitter.com/qhscWFsBVC
— Telugu360 (@Telugu360) March 6, 2024