పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి వచ్చిన తొలి పాట ‘దేఖ్‌లేంగే సాలా’ ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కేవలం 24 గంటల్లో 29.6 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. పవన్ కళ్యాణ్‌కు సరిగ్గా సరిపోయేలా దినేష్ మాస్టర్ అందించిన స్టెపులు ఈ పాట కు బాగా సుటేయ్యాయి. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ కృషి కూడా ఈ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చాయి.
Also Read : Dhurandhar : ‘ధురంధర్’ తెలుగు రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..?
ఈ పాట ఇంతటి భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణం దర్శకుడు హరీష్ శంకర్ అనడంలో సందేహం లేదు. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలనం తర్వాత, పవన్‌ను మళ్లీ అదే ఎనర్జీతో, పవర్‌ఫుల్ డ్యాన్స్‌తో చూడాలనుకునే అభిమానుల కోరికను ఆయన నెరవేర్చారు. హరీష్ శంకర్ సంగీతం విషయంలో చూపిన ప్రత్యేక శ్రద్ధ వల్లే, ‘దేఖ్‌లేంగే సాలా’ పాట పవన్ కళ్యాణ్ అభిమానులకు విందు భోజనంలా మారింది. పవర్‌స్టార్ పాత మ్యాజిక్‌ను తిరిగి తీసుకొచ్చినందుకు, హరీష్ శంకర్ బృందానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అద్భుతమైన విజయం ఈ చిత్ర బృందానికి మరింత బూస్ట్ ఇచ్చింది.