పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పవర్ ఫుల్ సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మరొకటి యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజి మూవీ.. ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.. పవన్ ఖాతాలో వీటితో పాటు ఎప్పుడో మొదలైన హరి హర వీరమల్లు సినిమా కూడా వుంది. కానీ పవన్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల తక్కువ డేట్స్ వున్న ఈ రెండు సినిమాలు పూర్తి చేసి ఆ తరువాత హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం..
అయితే పవన్ నటిస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు బాగా క్రేజ్ ఏర్పడింది.… ఈ సినిమాను పవన్ కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా విజయదశమి పండుగను పురస్కరించుకుని మైత్రి మూవీ మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫార్మ్ లో ఒక సమ్మిటి చేతిలో పట్టుకుని తప్పు చేసిన వారిని శిక్షించే వాడిలాగా ఎంతో ఆవేశంగా ఉన్నఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆయుధ పూజ మరియు దసరా శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ అయ్యే వరకు ఫాన్స్ ఈ పోస్టర్ ను తమ స్టేటస్ లలోనూ మరియు డీపీ లుగా పెట్టుకుంటున్నారు.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు