మెగాభిమానులు వేల కళ్లతో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ కాంబో డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రచార కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ‘ఇక అసలైన జాతర మొదలైంది.. ఉస్తాద్ అప్‌డేట్స్ బ్లాస్ట్ త్వరలోనే ఉండబోతోంది” అని ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.
Also Read : Nithin- VI Anand: ‘నో బాడీ.. నో రూల్స్’.. కాన్సెప్ట్‌తో నితిన్ నెక్స్ట్ మూవీ పోస్టర్ రిలిజ్..
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి మాస్ బీట్స్‌తో కూడిన సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ మేనరిజం, “ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు.. అంతకు మించి ఉంటుంది” అనే డైలాగ్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. మొత్తనికి పవర్ స్టార్ తన రాజకీయ బాధ్యతల నడుమే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులకు ఒక భారీ విందు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.
It begins ❤️🔥
Raise your hands in joy and cheer for our USTAAD 💥💥💥
POWER STAR @PawanKalyan & Cult Captain @harish2you are coming with a massive feast 🔥🔥#UstaadBhagatSingh updates Blast soon!
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP… pic.twitter.com/R53exrOVva
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) January 25, 2026