US visa review: డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడు అయినప్పటి నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన లేదా యూఎస్‌లో నివసిస్తున్న వలసదారులను బహిష్కరించడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన వలసదారుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ట్రంప్ సర్కార్ దేశంలో కొన్ని రకాల నియమాలు, చట్టాలను ఉల్లంఘించిన 5.5 కోట్లకు పైగా ప్రజల చెల్లుబాటు అయ్యే వీసాలను సమీక్షిస్తోందని అక్కడి అధికారులు తెలిపారు. యుఎస్ వీసా హెూల్డర్లందరూ అమెరికాలో ప్రవేశించడానికి, ఉండటానికి అర్హులో కాదో నిర్ధారించడానికి తనిఖీ చేస్తున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.
READ ALSO: AP Liquor Case : లిక్కర్ స్కాంలో నారాయణస్వామిని ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
ఈ ప్రక్రియ కొనసాగుతుంది…
యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ తనిఖీలో ఎక్కడైనా కొంచెం తేడాగా అనిపిస్తే వీసాలు రద్దు చేయడంతో పాటు, వీసాదారుడు అమెరికాలో ఉంటే అతన్ని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు సమాచారం. వీసా స్క్రూటినీ అనేది సమయం తీసుకునే ప్రక్రియ అని, అది కొనసాగుతుందని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ఈ స్క్రూటినీ చేస్తున్న వీసాల్లో నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు, ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొనడం, ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారు ఎవరైనా దేశంలో ఉన్నారా అనేది వెతుకుతున్నట్లు యూఎస్ విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ రికార్డులు, వీసా జారీ చేసిన తర్వాత వెలుగులోకి వచ్చే అనర్హతలను సూచించే సమాచారంతో పాటు తమ దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమీక్షిస్తున్నట్లు వాళ్లు తెలిపారు.
వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు లేబర్ వీసాలు బంద్..
వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయడాన్ని అమెరికా ఇకపై నిలిపివేస్తుందని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అమెరికా రోడ్లపై పెద్ద ట్రాక్టర్ – ట్రైలర్ ట్రక్కులను నడుపుతున్న విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరగడం అమెరికన్ల ప్రాణాలకు ముప్పు కలిగిస్తోందని అన్నారు. గత కొన్ని నెలలుగా, ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని ట్రక్ డ్రైవర్లకు ఇంగ్లీష్ మాట్లాడటం, చదవడం తప్పనిసరి చేసింది. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు రోడ్డు సంకేతాలు చదవడానికి రాకపోవడం, ఇంగ్లీష్ మాట్లాడలేక పోవడంతో మరణాలు పెరుగుతున్నాయని, అందుకే రోడ్డు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చర్యలను తీసుకున్నట్లు ఆ దేశ రవాణా శాఖ తెలిపింది.
READ ALSO: Ranil Wickremesinghe arrest: శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్..