US-Iran War: హార్ముజ్ వద్ద అమెరికా బిగ్ ఆపరేషన్.. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు రోజు రోసజుకూ పెరగుతున్నాయి. తాజాగా అమెరికా ఇరాన్ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు చేసింది. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాలపై విరుచుకు పడింది. ఈ దాడిలో ఏకంగా 5,000 పౌండ్ల బరువున్న బంకర్-బస్టర్ బాంబులను (Bunker-buster bombs) ఉపయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ నేడు ప్రకటించింది. ఈ క్షిపణి భూగర్భంలో ఉన్న లక్ష్యాలను ఈజీగా ఛేదించగలదు. తీర ప్రాంతంలోని భూగర్భంలో ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలను నాశనం చేసేందుకే ఈ ఆధునిక ‘డీప్ పెనెట్రేటర్’ మందు గుండు సామగ్రిని వాడినట్లు యూస్ వెల్లడించింది. ఈ దాడుల్లో కీలక విజయం సాధించామని, ఇరాన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను నాశనం చేసినట్లు ప్రకటించింది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఇదిలా ఉండగా.. తాజాగా నాటో (NATO – North Atlantic Treaty Organization)దేశాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు రక్షణగా తమ యుద్ధ నౌకలను పంపాలని డోనాల్డ్ ట్రంప్ కోరారు. ఈ అంశంపై స్పందించిన నాటో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. యుద్ధం ముగిసే వరకు తమ నౌకలను పంపే ప్రసక్తే లేదని మిత్ర దేశాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్రంపునకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు. పరిస్థితులు చక్కబడే వరకు తమ నౌకలను పంపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అనంతరం ట్రంప్ స్పందించారు. “నాటో పెద్ద తప్పు చేస్తోంది. మాకు ఎవరి సహాయం అవసరం లేదు, ఇరాన్‌ను ఒంటరిగానే ఎదుర్కోగలము” అని ధీమా వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాలపై అమెరికా విరుచుకుపడటం గమనార్హం.
READ MORE: Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..