Minister KTR: కేటీఆర్ తో యుఎస్ హ్యాండ్లూం రీసెర్చ్ స్కాలర్ భేటీ
తెలంగాణ చేనేత కళాఖండాలకు అమెరికాకి చెందిన రీసెర్చ్ స్కాలర్లు అబ్బురపడ్డారు. తెలంగాణ మంత్రి కే.తారకరామారావుతో అమెరికన్ హ్యాండ్లూమ్ రీసెర్చ్ స్కాలర్ సమావేశం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత ఉత్పత్తులు, చేనేత కళలపై సుదీర్ఘ పరిశోధనలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న కైరా మంత్రి కేటీఆర్ ని కలిశారు. తెలంగాణ చేనేత క్లస్టర్లను సందర్శించిన కైరా వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి నేతన్నల కళా నైపుణ్యం వారి నిబద్ధత పట్ల అబ్బురపడిన కైరా.. వివరాలు అడిగి మంత్రి ద్వారా తెలుసుకున్నారు.
Read Also:UP Girl Case: 2015లో హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత బతికొచ్చింది
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
తన అధ్యయనంలో భాగంగా గుర్తించిన పలు అంశాలను మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు కైరా.ఇంతటి కళా నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ ఉంటుందని తెలిపారు కైరా. ఈ సందర్భంగా తెలంగాణ టెక్స్ టైల్ రంగం, నేతన్నల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కైరాకు వివరించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యం, ఆ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు కురిపించారు. దీర్ఘకాలం పాటు తాను కొనసాగిస్తున్న చేనేతల అధ్యయనంలో భాగంగా ఆమె తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో కొనసాగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి మరియు అక్కడి స్థితిగతులపైన ఆమె క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
Read Also: Tirumala Fraud: టీటీడీ విజిలెన్స్ ఉచ్చులో మరో అక్రమార్కుడు
తాజావార్తలు
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!