US Iran Conflict: శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా దాడి.. ఒక్కసారిగా మారిన పరిస్థితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Iran Conflict: ఇరాన్‌కు చెందిన కిషమ్ (Qeshm) దీవిపై అమెరికా క్షిపణులతో విరుచుకుపడింది. గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై గుట్టుచప్పుడు కాకుండా చిన్నపాటి దాడులు చేస్తూ వస్తున్న అమెరికా, ఈసారి ఏకంగా కిషమ్ దీవిని లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి తెగబడింది. అమెరికాలో మధ్యంతర (మిడ్‌టర్మ్) ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే సమయాన్ని అనువుగా తీసుకుని, ఎన్నికలు ముగియగానే ఇరాన్‌పై మరో పెద్ద దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే, ఈ దాడి జరగడానికి కొద్ది గంటల ముందే ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌తో పెద్ద యుద్ధం తప్పుతుందని, ఆ ఆశలతోనే అంతర్జాతీయంగా చమురు ధరలు రికార్డు స్థాయిలో బ్యారెల్‌కు దాదాపు 10 డాలర్లు తగ్గాయని ట్రంప్ సోమవారం తన ‘ట్రూత్ సోషల్’ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇరాన్ కూడా అమెరికాతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వేన్స్ సైతం సోమవారం ఇరాన్‌తో చర్చలపై సానుకూలత వ్యక్తం చేశారు. గత వారమే ఇరాన్ భద్రతా విభాగం అధిపతి మొహసేన్ రెజాయికి ఆయన ఒక లేఖ రాశారు. దీనిపై వేన్స్‌ను ప్రశ్నించగా, ఇరాన్‌తో మంచి చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై ట్రంప్‌తో కూడా మాట్లాడానని, త్వరలోనే ఒక ఒప్పందానికి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవైపు అమెరికా ఎన్నికల కారణంగా ట్రంప్ నేరుగా పెద్ద దాడికి సంకోచిస్తుంటే, ఇజ్రాయెల్ మాత్రం నిరంతరం ఒత్తిడి పెంచుతూ వచ్చింది. దీనికి తగ్గట్టే పెంటగాన్ కూడా మధ్యప్రాచ్యంలో తన సైనిక శక్తిని మరింత పెంచింది. ‘యుఎస్ఎస్ థియోడోర్ రూజ్వెల్ట్’ విమానవాహక నౌకతో పాటు మెరైన్ దళాలను తీసుకెళ్లే ల్యాండింగ్ షిప్పులను పర్షియన్ గల్ఫ్ వైపు తరలించింది. శాంతి చర్చలు, ఒప్పందాలు జరుగుతాయని ఆశించిన సమయంలోనే అమెరికా ఈ క్షిపణి దాడికి పాల్పడటం, ఇరు దేశాల మధ్య కుదిరిన ఆ తాత్కాలిక ‘సీజ్ఫైర్’ వాతావరణాన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. ఈ దాడులతో గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
-
OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?
-
OTR: కాకినాడపై కూటమి స్పెషల్ ఫోకస్.. కులాల వారీగా మంత్రుల ప్రచారం!
-
OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!