US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి రగిలిపోయాయి. ఇరాన్‌కు చెందిన ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇరాన్ రివొల్యూషనరీ గార్డ్స్ (IRGC)కి చెందిన ఈ చమురు నెట్వర్క్ నెలకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జిస్తూ ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తోందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆరోపించింది. ఒమన్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న అమెరికా నౌకాదళ నౌకపై ఇరాన్ రెండుసార్లు బాలిస్టిక్ మిసైళ్లతో దాడికి యత్నించడంతో, దానికి ప్రతీకారంగానే అమెరికా ఈ కఠిన చర్యకు దిగినట్లు పేర్కొంది.
ఈ ప్రతీకార దాడిలో ఒమన్ ఖాతాలో ఉన్న M/T కావిజ్, M/T చార్మినార్, M/T హారిజన్ 1, M/T రీస్కో అనే నాలుగు ట్యాంకర్లతో పాటు, ఖార్గ్ ఐలాండ్ సమీపంలోని M/T దరియా అనే ఐదవ ట్యాంకర్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అయితే, దాడులకు ముందే ఆయా ట్యాంకర్లలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు పంపించినట్లు సెంటాకామ్ తెలిపింది. ఖార్గ్ ఐలాండ్, జాస్క్ సమీపంలో దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా కూడా ధృవీకరించగా, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. కాగా సెప్టెంబర్ 5న కూడా మూడు ఇరాన్ ట్యాంకర్లను అమెరికా ధ్వంసం చేయడం గమనార్హం.
Also Read
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
మరోవైపు, అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా బలగాలు ఉన్న ఓడరేవుల్లోకి వచ్చే చమురు నౌకలపై దాడులు చేస్తామని IRGC హెచ్చరించింది. వెంటనే ఆయా ఓడల్లోని సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో పాటు ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని ఖమీస్ ముషైత్, అభహా, నజ్రాన్, జజాన్ నగరాలపై డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా 73 మంది గాయపడ్డారు. రెండు దేశాల మధ్య రాజుకున్న ఈ తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ప్రపంచ వ్యాపారానికి ఎంతో కీలకమైన ‘స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్’ గుండా సాధారణ నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కుకు చేరాయి. ఒకవేళ ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!