పుట్టింది ఇండియాలో.. పెరిగింది అమెరికాలో.. ప్రస్తుతం బేగంపేట్ లో నివాసం.. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం ముంబైలో చేసిన ఉద్యోగంతో జోరుగా పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఇంకేముంది.. డ్రగ్స్ తీసుకునే వ్యక్తి నుంచి డ్రగ్స్ అమ్మకం వ్యక్తిగా ఎదిగాడు. తేజస్ కట్ట (29) అనే వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఇండియాలో పుట్టినటువంటి తేజస్ కట్ట వన్ ఇయర్ ఉండగానే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లాడు అమెరికాలో పౌరసత్వం కూడా ఉంది. చివరకు ఏమైందో తెలియదు కానీ.. కొడుకు బేగంపేట్ లో తల్లిదండ్రులు మరోచోట నివాసముంటున్న పరిస్థితి.
READ MORE: Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మజ్లిస్‌కు బానిసలు.. ఇదే నిదర్శనం!
హైదరాబాద్‌కు రాకంటే ముందు ముందు తేజస్ రెండేళ్ల పాటు ముంబైలో ఉద్యోగం చేశాడు. ముంబైలో ఉద్యోగంతో పాటు అన్ని రకాల డ్రగ్స్ ను అలవాటు చేసుకున్నాడు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ రీగాక్స్ అనే కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. తేజస్‌తో పాటు సోహెల్ అహ్మద్ (29) అనే వ్యక్తి కూడా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఇంకేముంది.. ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి డ్రగ్స్ అమ్మకానికి దిగారు. ప్రతి 15 రోజులకు ఒకమారు ముంబైకి వెళ్లి ఈ ఇద్దరు చెరస్, ఎల్ ఎస్ డి బ్లాస్ట్, ఓ జి కుష్ లాంటి డ్రగ్స్ ను ముంబై నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లోని సన్ సిటీ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతూ ఉంటారు. ఈ ఇద్దరికి తాజాగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
READ MORE: Ramanaidu Studio Lands: రామానాయుడు స్టూడియో భూములపై షోకాజ్ నోటీసులు