Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కారణాల వల్ల లేదా స్మార్ట్‌ఫోన్ వాడకం తెలియక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతుల కోసం సరికొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా రైతులు సులభంగా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మీసేవ విభాగం, వ్యవసాయ శాఖతో కలిసి ఈ సరికొత్త సేవలను రైతులకు ఉమ్మడిగా అందిస్తోంది.
ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునే రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్‌తో సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీసేవ ఆపరేటర్ రైతు సాగు విస్తీర్ణం, పంట వివరాలను ఆన్లైన్ సిస్టమ్‌లో నమోదు చేస్తారు. అనంతరం రైతు తనకు అనుకూలమైన ఎరువుల డీలర్‌ను ఎంచుకుని, అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో పాస్‌బుక్‌తో అనుసంధానమైన రైతు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ధృవీకరించిన వెంటనే ఒక బుకింగ్ ఐడీ జారీ అవుతుంది. కేవలం పది రూపాయల నామమాత్రపు సేవా రుసుముతో రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
Also Read
- Jofra Archer: "ఇది ఐపీఎల్ కాదు".. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
- Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
రైతులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీసేవ ద్వారా పొందిన ఈ బుకింగ్ ఐడీ బుక్ చేసిన తేదీ కాకుండా కేవలం 48 గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి రైతులు ఆ గడువు ముగిసేలోపే తాము ఎంపిక చేసుకున్న ఎరువుల డీలర్‌ను కలిసి సబ్సిడీ యూరియాను కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి రైతులు తమ పాస్బుక్కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. రైతులందరూ అధికారిక యాప్ లేదా మీసేవ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని.. ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) లేదా మండల వ్యవసాయ అధికారి (MAO)ని సంప్రదించాలని మీసేవ కమిషనర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
-
Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
-
Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..