UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
- పెట్రోల్ బంకులకు ఊరట
- UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
- ప్రత్యేక మినహాయింపు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పెంచింది. రూ.2,000 దాటిన లావాదేవీలపై ఛార్జీల పడతాయని తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. కానీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. నిర్వాహకులు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో యూపీఐ చెల్లింపులను రద్దు చేశారు. క్యాష్ ఉంటేనే పెట్రోల్ నింపుతామంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పెట్రోల్ బంకుల్లో రూ.2,000కు మించిన UPI లావాదేవీలపై Merchant Discount Rate (MDR) ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వచ్చిన వినతిని ఆర్థిక సేవల విభాగం (DFS) పరిశీలించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి.
Also Read
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
- NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
ప్రత్యేక మినహాయింపు?
పెట్రోల్ బంకులపై MDR భారం తగ్గించాలంటూ All India Petroleum Dealers Association (AIPDA) కేంద్రాన్ని కోరింది. సెప్టెంబర్ 16న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో.. రూ.2,000కు మించిన UPI చెల్లింపులపై పెట్రోల్ బంకులకు పూర్తిస్థాయి MDR మినహాయింపు ఇవ్వాలని AIPDA అధ్యక్షుడు అజయ్ బన్సల్ కోరారు. పెట్రోల్ బంక్ డీలర్ల ఆదాయం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించే స్థిరమైన మార్జిన్లపై ఆధారపడి ఉంటుందని AIPDA పేర్కొంది. ఈ మార్జిన్లు ప్రధానంగా విక్రయించిన ఇంధన పరిమాణంపై ఆధారపడతాయని, ఒక్కో లావాదేవీ విలువ పెరిగినంత మాత్రాన డీలర్ల ఆదాయం పెరగదని వివరించింది. ఇక UPI చెల్లింపులపై విధించే MDRతో పాటు ఇతర లావాదేవీ ఛార్జీల నుంచి కూడా పెట్రోల్ బంకులకు పూర్తి మినహాయింపు ఇవ్వాలని AIPDA కోరింది. ఒకవేళ ప్రస్తుత MDR విధానం కొనసాగితే.. ఇంధన విక్రయ కేంద్రాలకు శాతం ఆధారిత MDRతో పాటు స్థిర లావాదేవీ ఛార్జీల నుంచి కూడా ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
డీలర్ల డిమాండ్‌ను పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఉన్నత స్థాయిలోనూ చర్చ జరిగే అవకాశం ఉందని మరో ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు MDR ఛార్జీల్లో మార్పు కోసం ఎలాంటి ప్రతిపాదన తమ దగ్గరకు రాలేదని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
అక్టోబర్ 15 నుంచి
కొత్త UPI MDR విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం రూ.2,000కు మించిన అర్హత కలిగిన Person-to-Merchant (P2M) UPI లావాదేవీలపై MDR వర్తిస్తుంది. సాధారణంగా MDR రేటును 0.4 శాతంగా నిర్ణయించగా.. ఇంధనం వంటి కొన్ని ప్రత్యేక రంగాలకు అర్హత కలిగిన లావాదేవీలపై ఫ్లాట్‌గా రూ.5 MDR విధించనున్నారు. అయితే రూ.2,000 వరకు జరిగే UPI లావాదేవీలపై MDR ఉండదు.
పెట్రోల్ బంకులు నిరాకరణ
కొత్త MDR విధానంపై పెట్రోల్ బంక్ డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదనపు ఛార్జీల వల్ల ఇప్పటికే పరిమితంగా ఉన్న తమ మార్జిన్లపై మరింత భారం పడుతుందని చెబుతున్నారు. మధ్యప్రదేశ్, పంజాబ్‌లోని కొంతమంది పెట్రోల్ బంక్ డీలర్లు అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన UPI చెల్లింపులను స్వీకరించబోమని ప్రకటించారు. MDR భారం కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని డీలర్లు మాత్రం కస్టమర్లకు కార్డుల ద్వారా చెల్లించే అవకాశం కొనసాగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో UPI చెల్లింపులపై MDR నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి మాత్రం దీనిపై తుది నిర్ణయం వెలువడలేదు.
- Tags
- MDR
- petrol
- UPI
- UPI charges
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!