Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- ఓట్ల దొంగతనం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడింది
- సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓట్ల దొంగతనం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడిందని.. హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించిందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఓటు చోరీపై ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం తీరును మరోసారి ఎండగట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లను దొంగిలిస్తే.. ప్రజల ప్రతినిధులు రూపొందించే చట్టాల చట్టబద్ధతపైనా ప్రశ్నలు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నా తాము మౌనంగా ఉండబోమని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విషయంలో ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు పట్టించుకోలేదంటూ వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు సంబంధించిన హక్కులే ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓట్లు అక్రమంగా ప్రభావితం చేస్తే.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా రూపొందే చట్టాలపైనా ప్రశ్నలు తలెత్తుతాయని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)తో పాటు ఫారం-6 మార్పులు, ఓటర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఎన్నికల డేటా నిర్వహణ వంటి అంశాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా నివేదిక పేర్కొంది. గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు నమోదు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది. అయితే ఈ నివేదికపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం నిర్ణయ ప్రక్రియలో భాగమేనని, గత ఏడాది తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే ఉన్నాయని పేర్కొంది.
- Tags
- rahul gandhi
- SIR
- Vote Chori
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..