UP: మహిళపై గ్యాంగ్ రేప్, బాధతో ఆత్మహత్య.. పోలీసులు ఏం చేశారంటే..?
- ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో గ్యాంగ్ రేప్ కు గురైన మహిళ సూసైడ్
- ఈ కేసును గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరణ
- ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్ల కింద కేసు
- ఈ కేసుపై మండిపడుతున్న జనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో సామూహిక అత్యాచారానికి గురై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఈ కేసును ఎఫ్ఐఆర్లో గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరించారు. దానికి బదులుగా ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్లను జోడించారని మృతురాలి తండ్రి చెప్పాడు. దీంతో.. ఈ కేసుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. అత్యాచార ఘటన ఆగస్టు 17న జరిగింది. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు ఊరి నుంచి బయటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఓ పాఠశాల సమీపంలో పడేసి వెళ్లిపోయారు. కాగా.. బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో.. వెంటనే తండ్రి అక్కడికి చేరుకుని మహిళను ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం.. ఆ మహిళ తన కుటుంబానికి జరిగిందంతా చెప్పింది. అయితే.. కొన్ని గంటల తర్వాత బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది.
Indra 4K: బద్దలు కొడుతుంది అనుకుంటే ‘మురారి’ని టచ్ చేయలేదుగా!
Also Read
ఈ ఘటనపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అయితే పోలీసులు మాత్రం గ్యాంగ్ రేప్ కేసుకు బదులు, ఆత్మహత్య కేసు నమోదు చేశారని తండ్రి తెలిపాడు. కాగా.. గ్యాంగ్ రేప్ ఆరోపణలపై కేసు నమోదు చేయడానికి నిరాకరించిన సబ్ ఇన్స్పెక్టర్ను తన పోస్ట్ నుండి తొలగించారు. అంతేకాకుండా.. అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాగా.. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని ఆగస్టు 19న అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడిని మరుసటి రోజు అరెస్టు చేశారు.
Maharashtra polls: సీఎం పోస్టుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
అయితే.. అరెస్టు సమయంలో ఇద్దరు నిందితులు పోలీసు జీపులో నుండి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుల కాళ్లు విరిగిపోయాయి. మరొక నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్తే.. తమపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. కాగా.. పోలీసులు జరిపిన ప్రతీకార కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్యామ్ దేవ్ తెలిపారు. అనంతరం.. ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!