భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడూ ఒకదానికొకటి కంటే ఎక్కువ ఫీచర్లు, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు ఉండే కార్లను ఆటోమొబైల్ కంపెనీలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ "బెస్ట్యూన్" తన కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును 2023లో విడుదల చేసింది.
BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో లాంచ్ చేశారు. 2025 ఫిబ్రవరి 17న BYD భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ SUV, సెడాన్ కార్లను విడుదల చేసింది. ఈ కారును భారత్ మొబిలిటీ 2025 నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కాగా.. 2025 జనవరి18 నుండే ఈ వాహనానికి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
భారతీయ మార్కెట్లో కొత్త కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వాహనాలకు సరసమైన ధరలు, అధిక సామర్థ్యం, పర్యావరణానికి అనుకూలత వంటి విశేషాలతో అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగం పెరుగుతున్న డిమాండ్‌తో వాటి తయారీ సంస్థలు ప్రతి రోజు కొత్త ఆవిష్కరణలను ప్రజలకు అందిస్తున్నాయి. ఈ క్రమంలో సింపుల్ ఎనర్జీ అనే భారతీయ స్టార్టప్ ఫిబ్రవరి 11న 1.5 జనరేషన్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
Jitendra Yunik EV Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా టూ వీలర్ వినియోగదారులు ఇప్పుడు ఈవీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఓలా, ఏథర్ వంటి పెద్ద కంపెనీలు ఈ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాయి. ఇక స్టార్టప్ సంస్థలు కూడా ఈ సెక్టార్‌లో తమ మార్కు చూపించేందుకు సిద్దమవుతున్నాయి. అందులో భాగంగానే నాసిక్‌కు చెందిన జితేంద్ర ఈవీ అనే స్టార్టప్ సంస్థ, తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ “యూనిక్” మోడల్‌ను…