UP Policeman uploads bike stunts reel in uniform, Suspended: యువతకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన, బైక్ స్టంట్‌లు చేసిన వారిపై జరిమానా విధించాల్సిన ‘పోలీసులే’ కొన్ని చోట్ల నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఓ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తూనే బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. యూనిఫాంలో ఉండి స్టంట్స్ చేసినందుకు ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు.
సందీప్ కుమార్ చైబే గోరఖ్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా పోలీస్ యూనిఫాంలో ఉన్న సందీప్ చౌబే.. రేసింగ్ బైక్‌పై రోడ్డుపై విన్యాసాలు చేశాడు. మరొకరితో వీడియో తీయించి.. ఆ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ రీల్‌లో ‘నీకు శత్రువులంటే భయం లేదా?’ అని ఒక అమ్మాయి అడగ్గా.. ‘శత్రువులు అంటే భయం ఎందుకు?. చావు అంటే ఏంటి?.. ఈరోజు కాకపోతే రేపైనా మనం చనిపోతాం. భయపడాలంటే దేవుడికి భయపడండి. కీటకాలు, స్పైడర్లకు ఎందుకు భయపడతారు?’ అని సదరు కానిస్టేబుల్ జవాబిస్తాడు.
Also Read: Nicholas Pooran Century: 40 బంతుల్లో సెంచరీ.. తొలి ఆటగాడిగా నికోలస్ పూరన్ అరుదైన రికార్డు!
కానిస్టేబుల్ సందీప్ కుమార్ చైబే ఇన్‌స్టాగ్రామ్ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని ఈ ఏడాది ఆరంభంలో (ఫిబ్రవరి 8) ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వును ఉల్లంఘించిన కానిస్టేబుల్ సందీప్ చౌబేపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడ్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
➡️सिपाही का रील वीडियो सोशल मीडिया पर वायरल
📷सोशल मीडिया पर रील वीडियो बनाकर डाला था
📷वायरल वीडियो का संज्ञान लेकर की गई कार्रवाई
📷कैण्ट थाने में तैनात सिपाही को किया गया सस्पेंड. #Gorakhpur@gorakhpurpolice@Uppolice pic.twitter.com/GiaTLHdxtN— Anurag Mishra (@Anuragm91) July 30, 2023