Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Up Man Gives Triple Talaq To Bride 2 Hours After Nikah Over Dowry

Triple Talaq: కట్నం ఇవ్వలేదని పెళ్లైన 2 గంటలకే ట్రిపుల్ తలాక్‌.. తర్వాత ఏమైందంటే?

Published Date :July 15, 2023 , 7:54 am
By Mahesh Jakki
Triple Talaq: కట్నం ఇవ్వలేదని పెళ్లైన 2 గంటలకే ట్రిపుల్ తలాక్‌.. తర్వాత ఏమైందంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Triple Talaq: కట్నం దురాశతో ఓ వరుడు చేసిన పనికి వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బంధువుల ముందు వధువు కుటుంబసభ్యుల పరువు పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరోసారి ట్రిపుల్ తలాక్ ఘటన తెరపైకి వచ్చింది. కట్నంగా కారు ఇవ్వలేదని పెళ్లయిన రెండు గంటలకే వరుడు వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలున్నాయి. అనంతరం వరుడు నిఖా మండపంలో వధువును వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో వధువు కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే సమయంలో వధువు సోదరుడు తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వరకట్న అత్యాశపై కేసు పెట్టాడు. వధువుపై తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు వరుడితో పాటు అతడి కుటుంబసభ్యులపై శుక్రవారం కేసు నమోదు చేయబడింది.

అసలేం జరిగిందంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రకారం.. ఆగ్రాలోని ఫతేహాబాద్ రోడ్‌లోని ఓ మ్యారేజ్ హాల్‌లో ఇద్దరు సోదరీమణులు డాలీ, గౌరీల వివాహం ఒకే రోజు జరిగింది. పెద్ద కూతురు గౌరీ వివాహం అమన్‌తో జరిగింది. కుటుంబ సభ్యులు ఆచారాల ప్రకారం ఆమెకు వీడ్కోలు పలికారు. పెళ్లి వేడుక తర్వాత ఊరేగింపుగా గౌరీ అత్తమామలు వెళ్లిపోయారు. డాలీ వివాహం ఆసిఫ్‌తో జరిగింది. వివాహం తర్వాత.. ఆసిఫ్, అతని కుటుంబ సభ్యులు కట్నంగా కారును డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఒక్కసారిగా కారు డిమాండ్ చేయడంతో వధువు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.

Also Read: UCC: యూసీసీపై అభిప్రాయాలకు గడువు పొడిగింపు.. 28 వరకు అవకాశం

డాలీ తల్లిదండ్రులు కట్నంలోని ఇతర వస్తువులతో పాటు ఆసిఫ్‌కు కారు ఇస్తానని హామీ ఇచ్చారు. డాలీ కుటుంబానికి అక్కడికక్కడే కారు ఇప్పించాలని, లేదంటే రూ.5 లక్షలు ఇవ్వాలని వరుడి కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఇంత తక్కువ నోటీసులో కారు లేదా నగదును ఏర్పాటు చేయలేమని డాలీ కుటుంబం చెప్పింది. పెళ్లికొడుకును ఒప్పించాలని వధువు కుటుంబీకులు ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. లక్షల్లో కట్నకానుక విన్నవించినా వరుడు ఎవరి మాట వినలేదు. ఈ సమయంలో నవ వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పి వరుడు పెళ్లి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వధువు సోదరుడు కమ్రాన్ వాసీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆసిఫ్‌తో పాటు మరో ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏడుగురినీ అరెస్టు చేయాలని వాసీ డిమాండ్‌ చేశారు. ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 ప్రకారం మూడుసార్లు ‘తలాక్’ ఉచ్చరించడం ద్వారా స్త్రీకి విడాకులు ఇవ్వడం చట్టరీత్యా నేరం.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agra
  • bride
  • Bridegroom
  • dowry
  • telugu news

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions