Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరానికి చెందిన కాసిగవ గ్రామంలో ఓ దారుణ ఘటన జరిగింది. 65 సంవత్సరాల రాజేశ్వరి అనే మహిళని, తన కుమారుడు రాజారామ్ (లాదెన్) మత్తు పెట్టాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్రంగా అసహనానికి గురై, క్రూరంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం రాజారామ్ తన తల్లికి మద్యం కొరకు డబ్బులు ఇవ్వమని అభ్యర్థించాడు. రాజేశ్వరి తన కుమారుడికి డబ్బులు ఇవ్వడం నిరాకరించింది.
Lunar Eclipse 2025: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 12 గంటల పాటు ఆలయం మూసివేత!
దానితో అతడు మూర్ఖోభావంతో ఇంటి తాళాలు పగలకొట్టి లోపలకి ప్రవేశించాడు. ఆ తర్వాత వెంటనే తల్లి మీద కోపంతో దెబ్బలు కొట్టాడు. తల, ముఖంపై దెబ్బలు తగలడంతో రాజేశ్వరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన అనంతరం రాజారామ్ రక్తమయమైన బట్టతో బయటకు వచ్చాడు. గ్రామస్థులు అతని స్థితిని గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దానితో, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే రాజేశ్వరి మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
భారీ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్15తో కేవలం రూ.7499కే Lava Bold N1 5G లాంచ్!
పోలీసులు, ఫోరెన్సిక్ టీం సహాయంతో ఘటన స్థలానికి చేరుకుని.. పరిశీలనలు చేసి, అన్ని ఆధారాలు సేకరించారు. అనంతరం రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడానికి పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజారామ్ మద్యానికి బానిస కావడంతో.. గత కొంతకాలంగా తరచుగా డబ్బులు అడిగి, కుటుంబంలో కలహాలకి కారణమయ్యాడని తెలుసుకొన్నారు. ఈ నేరానికి సంబంధించి హత్య కేసు నమోదు చేసుకోగా.. విచారణ జరుగుతోంది.