Lava Bold N1 5G: ప్రముఖ భారత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తన కొత్త Bold N1 5G మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇదివరకు విడుదలైన Bold N1 4G, Bold N1 Pro మోడల్స్ తరువాత ఇది కొత్త 5G టెక్నాలజీతో వచ్చిన మోడల్. ఈ ఫోన్ 6.75 inch HD+ 90Hz LCD స్క్రీన్, UNISOC T765 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో రావడం ప్రత్యేకత. ఇక ఈ ఫోన్ లో 6.75 అంగుళాల (1612 × 720 పిక్సెల్స్) HD+ LCD డిస్‌ప్లే ఉంది. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ అనుభవం ఇస్తుంది. ఇది UNISOC T765 (6nm) SoC ఆధారంగా ఆక్టా-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. అందులో 2x Cortex A76 2.3GHz, 6x Cortex A55 2.1GHz కోర్స్ ఉన్నాయి. అంతేకాకుండా వీటికి తోడుగా Mali-G57 MC2 GPU గ్రాఫిక్స్ కోసం ఉపయోగించబడుతుంది.
Mirai : ‘మిరాయ్’ జర్నీ గురించి.. ఊహించని విషయాలు పంచుకున్న కార్తీక్ ఘట్టమనేని
Bold N1 5G ఫోన్ 4GB LPDDR4x ర్యామ్ తో వస్తుంది. అదనంగా 4GB వర్చువల్ RAM పెంచుకోవడానికి కూడా సపోర్ట్ కూడా కలిగి ఉంది. అలాగే ఇది ఇంటర్నల్ స్టోరేజ్ 64GB, 128GB వెర్షన్లలో అందుబాటులో ఉంది. అంతేకాదండోయ్.. మైక్రోSD ద్వారా 1TB వరకు పెంపొందించుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే.. రియర్ కెమెరాగా 13MP ప్రధాన కెమెరా + LED ఫ్లాష్, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరాగా 5MP ను అందించారు.

ఇక ఇందులో 5000mAh బ్యాటరీని అందించగా.. కేవలం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంది. కానీ బాక్స్ లో 10W ఛార్జర్ మాత్రమే వస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP54 రేటింగ్ (డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్) కూడా కలిపారు. Lava Bold N1 5G ఫోన్ కనెక్టివిటీ పరంగా అత్యాధునిక ఫీచర్లను అందిస్తోంది. ఇది 5G SA/NSA నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేయడంతో పాటు 4G VoLTE సపోర్ట్ కూడా కలిగి ఉంది. అలాగే, Wi-Fi 802.11 ac, Bluetooth 5.0, GPS + GLONASS నావిగేషన్, USB Type-C పోర్ట్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఎంపికలు కలిగి ఉంది. Bold N1 5G ఫోన్ క్లియర్ Android 15 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. వినియోగదారులకు 1 Android OS అప్డేట్, 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందజేయబడతాయి.
Today Astrology: నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు!

ఈ కొత్త Lava Bold N1 5G రెండు రంగులలో అందుబాటులో ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 కాగా, 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999 గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ విక్రయాలు ప్రత్యేకంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎర్లీ డీల్స్ ద్వారా ప్రారంభించబడ్డాయి. ఇక, SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 750 ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.