Madhya pradesh: భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు.. హైకోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల ధర్మాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. న్యాయస్థానం తీర్పుతో బాధితురాలికి షాక్ తగిలినట్లైంది. భర్త తనతో పలుమార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడంటూ ఓ మహిళ కేసు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ మహిళ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు మే 2019లో వివాహమైందని.. అయితే 2020 ఫిబ్రవరి నుంచి భార్య తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటుందని.. అంతేకాకుండా వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టిందని ఆ వ్యక్తి కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఇది గడిచిన రెండేళ్ల తర్వాత జులై 2022లో తన భర్త అసహజ సెక్స్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆమె మరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సెక్షన్ 377 ప్రకారం.. భార్యాభర్తల మధ్య అసహజ శృంగారం అత్యాచారం కింద పరిగణించలేమని అతడి లాయర్ వాదించారు. వైవాహిక అత్యాచార ప్రస్తావన భారతీయ చట్టాల్లో లేదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు.. 2019 నాటి కేసులో బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. అసహజ శృంగారం అత్యాచారం కాదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి: Kerala : బాత్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అమెజాన్ ప్యాకెట్‌లో పెట్టి రోడ్డుపై విసిరిన తల్లి
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ కేసుపై న్యాయమూర్తి గురుపాల్ సింగ్ అహ్లూవాలియా విచారణ జరిపారు. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం.. పదిహేనేళ్లు పైబడిన భార్యతో భర్త శృంగార చర్య అత్యాచారం కిందకు రాదన్నారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా భారతీయ చట్టాలు ఇంకా గుర్తించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అసహజ శృంగారానికి భార్య అనుమతి అంశం ప్రాధాన్యం కోల్పోతుందని… తనతో పాటు ఉంటున్న భార్యతో భర్త అసహజ శృంగారం నేరం కాదని సెక్షన్ 377 చెబుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే, సెక్షన్ 376బీ ప్రకారం విడిగా ఉంటున్న భార్యతో ఆమె అనుమతి లేకుండా శృంగారం అత్యాచారమేనని స్పష్టం చేశారు. కాబట్టి ఈ కేసులో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని తీర్పు వెలువరించారు.
ఇది కూడా చదవండి: Budi Mutyala Naidu: డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?