క్షత్రియ సమాజంపై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రూపాలా మరోసారి క్షమాపణలు చెప్పారు. క్షత్రియ వర్గానికి చెందిన మాజీ పాలకులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల మంత్రి పురుషోత్తం రూపాల ప్రమాదం నుంచి బయటపడ్డారు. కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న పడవ ఆదివారం సాయంత్రం ఒడిశాలోని చిలికా సరస్సులో రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. వెంటనే స్పందించిన సిబ్బంది చిలికా సరస్సులోకి మరో పడవను పంపి.. మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మత్స్యకారులు వేసిన వలలో పడవ ఇరుక్కుపోయి ఉంటుందని ముందుగా అనుమానించగా.. తాము దారి తప్పిపోయామని మంత్రి పురుషోత్తం స్పష్టం చేశారు. 11వ దశ ‘సాగర్ పరిక్రమ’…