Andhra Pradesh Debts: ఏపీ అప్పులపై మరోసారి కేంద్రం క్లారిటీ.. అసలు అప్పు ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Debts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముగిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పు.. 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులతో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య రూ.4,42,442 కోట్లకు చేరుకున్నట్లు నిర్మల వెల్లడించారు. అంటే వైసీపీ సర్కార్ ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు రూ.1,77,991 కోట్లుగా నిర్మల పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టం చేశారు. కాగా, ఏపీ ప్రభుత్వం అప్పులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.. టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు.. ఇలా విపక్షాలు మొత్తం వైసీపీ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నాయి. అయితే, గతంలో టీడీపీ హయాంలో కంటే తక్కువ అప్పులు చేశామని వైసీపీ చెప్పుకొస్తున్నా.. విమర్శలు మాత్రం తగ్గడం లేదు..
Read Also: Students Fighting: రోడ్డెక్కిన విద్యార్థుల గొడవ.. రెండు వర్గాలుగా చీలి పరస్పరం దాడులు
Also Read
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
అయితే, ఏపీ అప్పులపై ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి క్లారిటీ ఇచ్చారు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పార్లమెంట్లో ప్రస్తావించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని, ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటి మరీ అప్పులు చేస్తోందని ఆరోపించారు. అప్పులకు సంబంధించి అసెంబ్లీకి కూడా వివరాలు ఇవ్వడం లేదని లోక్‌సభలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులకు సమాధానం చెప్పాలని కోరారు… అయితే, ఏపీ అప్పులపై ఇప్పటికే ఓ సారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.. ఇప్పుడు మరోసారి క్లారిటీగా పార్లమెంట్లో వివరించారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?