NTV Telugu Site icon

Bandi Sanjay: అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. లేనప్పుడు మరో మాట

Bandi Sanjay

Bandi Sanjay

సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన రజకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తోపాటు పలువురు నేతలతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ను బండి సంజయ్ తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగారు.

Kalinga Movie: కళింగ సినిమాపై రిజల్ట్‌పై చిత్రబృందం స్పందన ఇదే..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని మాట ఇచ్చిన తరువాత వరుసగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మోడీ ఆదేశాలు, అమిత్ షా సూచనల మేరకు కేంద్ర పర్యాటక, సాంస్క్రుతిక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ భాగమై ఈ ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. అందులో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఫోటో ఎగ్జిబిషన్ ను చూడగటానే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణకు విముక్తి కోసం చేసిన పోరాటాలు…సమర యోధుల త్యాగాలను కళ్లకు కట్టినట్లుగా చూపారని బండి సంజయ్ పేర్కొన్నారు.

తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాల చరిత్రను 75 ఏళ్లపాటు తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఎన్నో ఏళ్లపాటు తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని యువకులు జాతీయ జెండాలు పట్టుకుని ఉద్యమించారు.. లాఠీదెబ్బలు తిన్నారన్నారు. ఎందుకంటే నాడు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలు మామూలు విషయం కాదు.. రజాకార్ల పాలనలో దారుణాలు అన్నీ ఇన్నీ కావు.. బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, వెయ్యి ఊడల మర్రి సంఘటనలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయని అన్నారు. నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన దురాగతాలు మరవలేమని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనపై కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటాలను, హిందూ మహాసభ, ఆర్య సమాజ్ పోరాటాలను గుర్తుచేసేందుకు, రాబోయే తరాలకు ఈ చరిత్రను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు.

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎంకు అరుదైన గౌరవం..

తెలంగాణ విమోచన దినోత్సవాలు జరిపే అర్హత బీజేపీకి లేదన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. మరి కాంగ్రెస్ కు మాత్రమే ఆ అర్హత ఉంటే ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు నిర్వహించడం లేదు..? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 50 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించారు కదా.. మరి నాటి నుండి ఎందుకు నిర్వహించలేదన్నారు. నాటి తెలంగాణ పోరాట యోధులను ఎందుకు స్మరించలేదు..? తెలంగాణ విమోచనం కోసం ఆపరేషన్ పోలో నిర్వహించిన సర్దార్ పటేల్ ను ఎన్నడైనా స్మరించిందా? అని దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవాలపై అధికారంలో లేనప్పుడు ఒకమాట… వచ్చాక మరోమాట… ఇదీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల తీరు అని మండిపడ్డారు. ఒక పార్టీ ఏమో ‘సెప్టెంబర్‌ 17న సమైక్యత దినోత్సవం’ అంటది.. ఇఫ్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ‘ప్రజాపాలనా దినోత్సవం’ నిర్వహిస్తుందట. మరి దాదాపు 50 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలారు కదా… ఇన్నాళ్లు మీరు చేసింది ప్రజా వంచనా? ప్రజా వంచన దినోత్సవంగా నిర్వహించుకోండని అన్నారు.