Bandi Sanjay Kumar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చేపట సేవా కార్యక్రమాల్లో భాగంగా.. ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా 20 వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పిల్లల విద్యాభ్యాసానికి ప్రోత్సాహంగా, ప్రధానమంత్రి మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. ముఖ్యంగా టెన్త్ తరగతి చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ స్వయంగా సైకిళ్లను అందజేస్తున్నారు. తొలిరోజు కరీంనగర్ టౌన్ విద్యార్థులకు అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ఈ పంపిణీ మొదలు కానుంది.
Read Also:Story board: అంతా రైతు సంక్షేమం గురించి మాట్లాడేవారే.. ఆదుకునే వారు మాత్రం లేరు..!
ఈ కార్యక్రమానికి సంబంధించి అంబేద్కర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రితోపాటు కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సభకు హాజరవుతారు. మొత్తం నెల రోజుల వ్యవధిలో పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలల టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు సమయానికి సైకిళ్లు అందేలా చూసేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో విద్యాశాఖ అధికారులకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతీ విద్యార్థినీ, విద్యార్థికి ఈ సదుపాయం అందేలా ప్రత్యేక నిఘా పెట్టారు.
Read Also:Fake Officers: నగరంలో మహా మాయగాళ్లు.. మోసం చేసి కోట్లు దండుకున్న నకిలీ టాస్క్ ఫోర్స్ ముఠా..!
ప్రతి ఏడాది తన పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో గుర్తుంచుకునే బండి సంజయ్, గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్లు, మెడికల్ ఎక్విప్‌మెంట్‌లు, అంబులెన్స్‌లు, ఫ్రీజర్లు తదితరాలను అందజేశారు. ఈసారి విద్యారంగాన్ని టార్గెట్ చేస్తూ.. విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే విధంగా సైకిళ్ల పంపిణీని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రవాణా భారం తగులకుండా, విద్యపట్ల ఆసక్తి పెరిగేలా చేసే దిశగా ప్రయత్నించబడుతోంది. స్థానికంగా ఈ కార్యక్రమంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.