AP Bifurcation Act: ఏపీ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ లోని అంశాల అమలుపై కేంద్రం సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ విభజన చట్టంలోని అంశాలు- అమలుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇవాళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, విద్యా సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, 13వ షెడ్యూల్ అనుసరించి ఆస్తుల విభజన తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏపీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం చేశారు. విభజన చట్టం స్పూర్తిని పరిగణనలోకి తీసుకుని తోడ్పాటు అందివ్వాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం తరపున అధికారులు కోరారు. మొత్తం 11 విద్య సంస్థల్లో ఇప్పటి వరకు “శాశ్వత క్యాంపస్”లు సమకూర్చుకుని ప్రారంభమైన 6 విద్యా సంస్థలు.. మరో 4 విద్యాసంస్థలకు “తాత్కాలిక క్యాంపస్”లు.. ఇంత వరకు మంజూరు కాని “వ్యవసాయ విశ్వవిద్యాలయం”.. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరపున అధికారులు తెలిపారు.
Read Also: Sudigali Sudheer: రష్మీతో పెళ్లి.. బాంబ్ పేల్చిన సుధీర్
Also Read
మౌలిక వసతుల కల్పనలో 8 అంశాల అమలు పురోగతిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించింది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పురోగతిలో ఉన్న రెండు అంశాలు.. మౌలిక వసతుల కల్పనలోని 8 అంశాల అమలుకు సంబంధించి, చట్టంలో పేర్కొన్న మేరకు “పరిశీలించండి” అన్న పదాన్ని కాకుండా, విభజన చట్టం స్పూర్తిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ఉన్నతాధికారులు కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ తరఫున సీఎస్ జవహర్ రెడ్డి, శ్రీలక్ష్మి, ప్రేమచంద్రారెడ్డి, ఎస్ఎస్ రావత్ తదితర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ఎన్నికల కారణంగా తెలంగాణ అధికారులు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు.
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు’ బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు ‘సూర్య’ ఖరీదైన గిఫ్ట్
-
Windfall Tax: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు.. ఎవరికి లాభం?
-
Sajjala Ramakrishna Reddy: టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్!
-
Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..