Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ మెజీషియన్ గా కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కమెడియన్ గా కొనసాగకుండా హీరోగా మారి.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇక ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి కాలింగ్ సహస్ర. అరుణ్ విక్కిరాల దర్శకత్వ వహించిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్ ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చాడు. ఇక సుధీర్ బయటకు వచ్చిన ప్రతిసారి అందరు అడిగే ప్రశ్న.. రష్మీతో మీ రిలేషన్ ఏంటి ..? ఆమెతో మీ పెళ్ళెప్పుడు.. ? . ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్న సుధీర్ కు, రష్మీ కు ఎదురయ్యే ప్రశ్న. అయితే వారెప్పుడు తాము మంచి స్నేహితులమే కానీ, లవర్స్ కాము అని, అది కేవలం ఆన్ స్క్రీన్ రొమాన్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.
Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ పాస్.. రైతు బిడ్డకే.. మరి ఆమె కోసం వాడతాడా.. ?
ఇక ఈ ప్రమోషన్స్ లో కూడా అదే క్లారిటీ ఇచ్చాడు.. “రష్మీ తో పెళ్లి అనే ప్రశ్న నాకు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు.. అంతగా జనం మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అందుకు వారందరికీ థ్యాంక్స్. రష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే.. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు.. ప్రస్తుతానికైతే నా ఫోకస్ అంతా సినిమాలపైనే.. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు.. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ దేవుడు, నన్ను పెళ్లి వైపు తిప్పితే చేసుకుంటానేమో చూడాలి” అని చెప్పుకొచ్చాడు. ఇక రష్మీతో నటించాలని తనకు ఉందని, మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తామని చెప్పుకొచ్చాడు.