Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Ukrainian Asked India To Help Rebuild The Economy

Ukrainian: భారత్ సాయం కోరిన ఉక్రెయిన్.. స్పందించని మోడీ సర్కార్

Published Date :January 12, 2024 , 1:19 pm
By Chandra Shekhar Pamena
Ukrainian: భారత్ సాయం కోరిన ఉక్రెయిన్.. స్పందించని మోడీ సర్కార్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Russia-Ukraine war: రష్యా నుంచి భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. సాయం కోసం భారత్‌కు విజ్ఞప్తి చేసింది. రష్యా దాడుల కారణంగా దేశం సర్వనాశనమైందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఉక్రెయిన్ పేర్కొంది. ప్రపంచ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా పునర్నిర్మాణంలో ఉక్రెయిన్ ఇప్పుడు భారతదేశం నుంచి సహాయం కోరింది. గుజరాత్‌లో జరిగిన వైబ్రంట్ సదస్సులో ఉక్రెయిన్ డిప్యూటీ ఆర్థిక మంత్రి వోలోడిమిర్ కుజ్యో దేశాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ఒక ప్రణాళికను సమర్పించారు. దీని వల్ల ఉక్రెయిన్‌కే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మేలు జరుగుతుందన్నారు. గుజరాత్‌లో ఉక్రెయిన్ అధికారులకు వేదిక ఇవ్వడం భారత విదేశాంగ విధానంలో మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.

Read Also: Pawan Kalyan: గుంటూరు కారం రిలీజ్ రోజున ట్రెండ్ అవుతున్న అజ్ఞాతవాసి…

అయితే, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ, మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నప్పుడు ఉక్రెయిన్ ఈ కామెంట్స్ చేసింది. అయితే, భారత్- రష్యా మధ్య దశాబ్దాలుగా సాంప్రదాయ సంబంధాలు కొనసాగుతున్నాయి. చమురుతో పాటు, ఆయుధాలు, అణు సాంకేతికతను రష్యా నుంచి భారత్ తీసుకుంటుంది. ఇక, ప్రస్తుతం హైవేలు నిర్మించడం, సముద్రంతో పాటు నది నౌకాశ్రయాలు, రైలు రోడ్లు, నిల్వ, పంపిణీ వంటి మౌలిక సదుపాయాలలో భారతదేశం పెట్టుబడి పెట్టాలని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరుతుంది.

Read Also: Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట..!

ఇక, ఉక్రెయిన్‌లోని వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అక్కడక్కడ పడి ఉన్న ల్యాండ్‌మైన్‌లను తొలగించడంలో భారతదేశం సహాయం చేయాలని జెలెన్స్కీ ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఉక్రెయిన్ డిమాండ్‌పై భారత్ ఇంకా స్పందించలేదు.. కాగా, ఉక్రెయిన్‌ కోరినప్పటికీ భారత్‌ అక్కడ ఎలాంటి పెట్టుబడులు పెట్టబోదని పలువురు నిపుణులు చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • PM Modi
  • ravaged economy
  • Russia
  • Ukraine

తాజావార్తలు

  • Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్‌, లోకేష్‌ సహా నేతల దిగ్భ్రాంతి

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!

  • Iran: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ప్రకటన.. హోర్ముజ్ తర్వాత మరో ముప్పు.. చమురు సంక్షోభం తప్పదా?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక భేటీ.. అమరావతి చట్టబద్ధతపై తీర్మానం..

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions