కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు శాఖల్లో ఖాళీలు ఉన్న భర్తీ చేస్తూ వస్తుంది.. ఈ మేరకు తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీ జీతాలతో ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.. యూఐడీఏఐ వివిధ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీనియర్ అకౌంట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ వంటి పోస్టులను సంస్థ భర్తీ చేస్తుంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరి 1 లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
యూఐడీఏఐ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 10 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో నాలుగు టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, నాలుగు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టలు ఒకటి చొప్పున భర్తీ కానున్నాయి..
అర్హతలు..
పోస్టును భట్టి వేర్వేరుగా ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. మాస్టర్స్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్, డిగ్రీ లలో కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేసి ఉండాలి..
ఎంపిక విధానం..
అభ్యర్థులను డిప్యుటేషన్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు UIDAIతో కలిసి న్యూఢిల్లీ కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది..
జీతం..
ఒక్కో ఉద్యోగానికి ఒక్కో జీతం ఉంది.. టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.20,600 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.14,900 నుంచి రూ.71,000; ప్రైవేట్ సెక్రటరీకి రూ.20,600 నుంచి రూ.1,60,000; సీనియర్ అకౌంట్ ఆఫీసర్‌కు రూ.24,900 నుంచి రూ. 1,80,000 వరకు జీతం లభిస్తుంది..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్లికేషన్ ఫారమ్‌కు జత చేసి డైరెక్టర్ (HR), యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), బంగ్లా సాహిబ్ రోడ్, కాళీ మందిర్ వెనుక, గోలే మార్కెట్, న్యూఢిల్లీ-110001 కు పంపించాలి..