Ugadi 2024: చంద్రబాబుకు అధికార యోగం.. త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ugadi 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని అధికార, విపక్షాలు తమతమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు.. పంచాంగ శ్రవణం నిర్వహించాయి.. ఇక, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు ఉగాది పచ్చడి అందించి ఆశీర్వదించారు వేద పండితులు. అనంతరం పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్.. పంచాంగ శ్రవణం చేస్తూ.. రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. పొత్తులతో ఏం జరగబోతోంది లాంటి విషయాలను కూడా వెల్లడించారు..
Read Also: Bellamkonda Sreenivas: మూడు సినిమాలు లైన్లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక రచ్చ రచ్చే!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
పంచాగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన పంచాంగ శ్రవణంలో చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందని తెలిపారు.. చంద్రబాబుకు అధికార యోగం ఉందన్న ఆయన.. త్రిమూర్తులు కలయికతో ఆంధ్రప్రదేశ్‌కి మేలు జరుగుతోందన్నారు.. బ్రహ్మ – నరేంద్ర మోడీ, విష్ణువు – పవన్ కల్యాణ్, ఈశ్వరుడు – చంద్రబాబు.. ఇలా త్రిమూర్తులుగా అభివర్ణించారు.. ఇక, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ సెగ్మెంట్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించనున్నట్టు పేర్కొన్నారు.. చంద్రబాబు మళ్లీ అమరావతి నిర్మాణం చేపడతారని తెలిపారు. టీడీపీది వృశ్చిక రాశి.. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారని వెల్లడించారు మాచిరాజు వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో పాటు.. వర్ల రామయ్య తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!