Bellamkonda Sreenivas: మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక రచ్చ రచ్చే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellamkonda Sreenivas Upcoming Movies Updates: నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా 2014లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు, సాక్షం, అల్లుడు అదుర్స్, సీత, కవచం వంటి చిత్రాలు నిరాశపరిచాయి. మధ్యలో జయ జానకీ నాయక, రాక్షసుడు సినిమాలు హిట్‌లుగా నిలిచాయి. ఇక ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేయగా.. ఘోర పరాజయాన్ని చవి చూసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు పూర్తైంది. ప్రస్తుతం అతడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘టైసన్ నాయుడు’. భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. 14 రీల్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా టైసన్ నాయుడు షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు మూన్‌షైన్ పిక్చర్స్‌తో సినిమాలు చేయనున్నాడు. వీటికోసం మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్ కనిపించనున్నాడని తెలుస్తుంది.
Also Read
Also Read: Love Mouli Trailer: నవదీప్ ‘లవ్ మౌళి’ ట్రైలర్.. బోల్డ్ కంటెంట్ బోలెడుంది!
బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ మూడు సినిమాలు కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తాయి అని అంటున్నారు. యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్ బ్యాక్ మూవీలు అవుతున్నాయి అని ఆశిస్తున్నారు. మంచి యాక్షన్స్, డ్యాన్సులు చేసే బెల్లంకొండకు మంచి స్క్రిప్ట్ ఇప్పటికైనా దొరుకుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!