Thackeray Brothers: ఎన్నికల సంఘం (EC), ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై రాజకీయ ఆందోళన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి రాలేదు. అయినప్పటికీ, సీజేపీ శివాజీ పార్క్‌లోనే ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమైంది. ముంబై పోలీసులు అనుమతి నిరాకరించడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ‘‘జైల్ భరో ఆందోళన్’’కు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే, ఈ సీజేపీ కార్యక్రమానికి శివసేన(యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) పార్టీ చీఫ్ ఠాజ్ ఠాక్రేలు మద్దతు ప్రకటించారు. మద్దతుపై ధన్యవాదాలు తెలిపుతు దీప్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, SIR ప్రక్రియ నిలిపేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఆందోళనలకు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే మద్దతు తెలిపారు.
శివాజీ పార్క్ వద్ద నిరసనలకు అనుమతి ఇచ్చే అధికారం తమకు లేదని ముంబై పోలీసులు ప్రకటించారు. హైకోర్టు తీర్పులు, అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ.. శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, సమీప ఆసుపత్రులకు రాకపోకలకు అంతరాయం వంటి కారణం అవుతాయని ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే.. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు అక్టోబర్ 04న ముంబైలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఉమ్మడి నిరసన మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఈ మార్చ్ బైకుల్లా నుంచి సీఎస్ఎంటీ వరకు సాగుతుంది. ఈ మార్చ్‌కు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించనున్నట్లు రాజ్ ఠాక్రే చెప్పారు.
I sincerely thank @OfficeofUT sir and @RajThackeray sir for extending their support to CJP’s protest in Mumbai on October 2.
All Indians must come together to save our democracy before it’s too late.
२ ऑक्टोबर रोजी मुंबईत होणाऱ्या CJP च्या आंदोलनाला पाठिंबा दिल्याबद्दल…
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 29, 2026

