UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. సీట్ల పంపకంపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉంటే 150 స్థానాలు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తు్న్నారు.
కాంగ్రెస్-ఎస్పీ మధ్య 150-80 పంచాయతీ..
అయితే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ మాత్రం ‘‘అభ్యర్థిని ప్రకటించండి, సీటు తీసుకోండి’’ అనే బలమైన సందేశాన్ని కాంగ్రెస్‌కు ఇస్తున్నారు. సీట్ల కేటాయింపు కేవలం డిమాండ్లు, వాదనల ఆధారంగా కాకుండా గెలిచే సామర్థ్యంపై జరుగుతుందని చెబుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్‌కు 17 ఎంపీ స్థానాలను కేటాయించింది. దీని ఆధారంగా కాంగ్రెస్‌కు 80-85 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని ఎస్పీ భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రం తమ బలం గతంలో కన్నా పెరిగిందని 150 కావాలని, కనీసం100 సీట్లకు తగ్గేది లేదని స్పష్టం చేసింది.
Also Read
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
గెలిచే సత్తా ఉంటేనే సీటు..
సీట్ల పంపకంలో సంఖ్య ముఖ్యం కాదని, గెలిచే సత్తానే ముఖ్యమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెబుతున్నారు. గెలవగల అభ్యర్థికే సీటు ఇవ్వాలనే వైఖరిని స్పష్టం చేవారు. కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటున్న సీట్ల జాబితాలో పాటు, తమ అభ్యర్థి పేర్లను కూడా స్పష్టం చేయాలని ఎస్పీ కోరుతోంది. ఆ సీట్ల జాబితా ఇవ్వాలని ఎస్పీ కోరుతోంది.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమిలో భాగంగా కాంగ్రెస్ కు 105 స్థానాలు ఎస్పీ కేటాయించింది. కాంగ్రెస్ కేవలం 7 సీట్లను మాత్రమే గెలుచుకుంది. 2027లో మాత్రం అఖిలేష్ యాదవ్ ఎక్కువ సీట్లు ఎస్పీ వద్ద ఉంచుకోవాలని భావిస్తు్న్నారు. సీట్ల సంఖ్య మాత్రమే కాదు, బీజేపీ ఓడించడానికి ఎస్పీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని తెలుస్తోంది.
బలమైన స్థానిక అభ్యర్థులు ఉన్న చోట్ల మాత్రమే కాంగ్రెస్‌కు సీట్లు ఇవ్వాలని ఎస్పీ భావిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా పోటీలో ఉండాలంటే అభ్యర్థి బలంగా ఉండాలని అఖిలేష్ కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ నుంచి సీట్ల జాబితా, అభ్యర్థుల జాబితా కోరుతున్నారు. అయితే, సీట్ల సంఖ్యకు సరిపడే అభ్యర్థులు కాంగ్రెస్ వద్ద లేరని ఎస్పీ భావిస్తోంది. రాయ్‌బరేలీ, అమేథీ, సహారన్పూర్, ప్రయాగ్‌రాజ్, బారాబంకి వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బలం ఉందని ఆ పార్టీ వాదిస్తోంది. అయితే, ఈ ప్రాంతాల్లో సీట్లు వదులుకోవడానికి ఎస్పీ సిద్ధంగా లేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!