Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- ఈసీపై కాంగ్రెస్-బీజేపీ మధ్య ముదిరిన మాటల యుద్ధం..
- బీజేపీ లేని రాష్ట్రాల్లో ఎన్నికల సంఘ పనితీరుపై కాంగ్రెస్ వైఖరేంటి.?
- కర్ణాటక, హిమాచల్, పంజాబ్, కేరళలను ప్రస్తావించిన స్మృతి ఇరానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani: ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై తీవ్ర విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోసాలు జరిగాయని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తన ఓటముల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘంపై దాడి చేస్తోందని స్మృతి ఇరానీ అన్నారు . హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని అక్కడ కాంగ్రెస్ ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నిస్తుందా? అని అడిగారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇస్తుందా అంటూ ప్రశ్నించారు.
13.3 కోట్ల మంది పేర్లను ఎన్నికల సంఘం తొలగించిందనే ఆరోపణలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. మరణించిన వ్యక్తి లేదా ఒకే పేరు రెండుసార్లు ఓటర్ల జాబితాలో ఉన్నప్పుడు, ఆ పేర్లను కాంగ్రెస్ ఎందుకు అలాగే ఉంచాలని కోరుకుంటోందని అడిగారు. ఎస్ఐఆర్ కింద నోటీసులు అందుకున్న వారి ఇళ్ల నుంచి పత్రాలు సేకరించి, వ్యక్తిగతంగా ధృవీకరణ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసిందని కూడా ఆమె పేర్కొన్నారు.కాంగ్రెస్ చరిత్రను ప్రస్తావిస్తూ స్మృతి ఇరానీ లాహోర్ కాంగ్రెస్ సమావేశం, ఏఓ హ్యూమ్, బ్రిటిష్ పాలన గురించి చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌ను విమర్శించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
తాజావార్తలు
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!