Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో 5,053 పేజీల ఛార్జిషీట్
- హత్య కోసం ఇంటర్నెట్లో సెర్చ్
- పిచ్చిగా ప్రేమించిన కేతన్, అంతం చేసిన సియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేతన్కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి కేతన్ లోహగఢ్ కోటపై నుంచి తోసి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 5053 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేతన్‌ను హత్య చేసేందుకు సియా, చేతన్ వీరిద్దరి స్నేహితుడు రితేష్ హాంగేలు కలిసి పనిచేసినట్లు ఛార్జిషీట్ పేర్కొంది. ఈ హత్యను ప్రమాదంగా చూపించేందుకు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఫోన్ డేటాను వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఛార్జిషీట్లో మొబైల్ డేటా, వాట్సాప్ కాల్, కాల్ డీటెయిల్ రికార్డులు, ఫోటోలు, సాక్షుల వాంగ్మూలాలు , సాంకేతిక విశ్లేషణ వివరాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపుగా 80-85 మంది సాక్షలు వాంగ్మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హత్య కోసం గూగుల్‌లో సెర్చ్..
సియా, చేతన్‌లు హత్య తర్వాత సాక్షాలను, ఆధారాలను తొలగించడం, విష ప్రయోగం, డిజిటల్ ఆధారాలను తొలగించడంపై గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తేలింది. విషపూరిత పుట్టగొడుగుతో ఎలా చంపడం వంటి వాటిని వెతికారు. ఇదే కాకుండా మేఘాలయ సోనమ్ రఘువంశీ చేసిన హత్య గురించి సెర్చ్ చేశారు. హత్యకు ఎంచుకున్న లోహగఢ్ కోట గురించి ఇంటర్నెట్లో వెతికి తెలుసుకున్నారు. ఇదే కాకుండా మనుషుల్ని ఎలా తప్పుదారి పట్టించాలనే విషయాలను తెలుసుకున్నారు.
Also Read
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
లోహగఢ్పై రెక్కీ..
లోహగఢ్ పోర్టులో హత్యకు ముందు అక్కడ రెక్కీ నిర్వహించారు. మే 28న, 29న ఆ ప్రదేశాన్ని పరిశీలించినట్లు ఛార్జిషీట్ వెల్లడించింది. హత్యకు ముందే మే 31న సియా కేతన్‌ను లోహగఢ్ తీసుకెళ్లినట్లు కూడా పోలీసులు తెలిపారు. జూన్ 14న కేతన్‌ను అక్కడికి తీసుకెళ్లి హత్యకు ప్రయత్నించి విఫలమైనట్లు, ఆ తర్వాత జూన్ 18న మరోసారి టెక్కింగ్ పేరులో కేతన్‌ను లోహగఢ్ పోర్టుకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.
సియా, చేతన్ కలిసి తోశారు..
ఛార్జిషీట్ ప్రకారం, జూన్ 18న లోహగఢ్ పోర్టుకు తీసుకెళ్లిన తర్వాత కొండ ప్రాంతంలో కేతన్‌ను చేతన్, సియాలు కలిసి వెనక నుంచి తోసేసి చంపినట్లు తేలింది. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ముందుగానే ఒక కథ సిద్ధం చేసకున్నారని పోలీసులు ఆరోపించారు. కేతన్ జారిపడిపోయినట్లు కుటుంబ సభ్యుల్ని నమ్మించే ప్రయత్నం చేశారు.
ఆధారాలు తొలగించే ప్లాన్..
ఈ కేసులో డిజిటల్ ఆధారాలు దొరక్కుండా ఇద్దరు జాగ్రత్తలు తీసుకున్నారని తేలింది. గూగుల్, యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ, ఐక్లౌడ్ డేటా, వాట్సాప్ చాట్స్, కాల్ లాగ్స్, ఫోటోలు తొలగించినట్లు తేలింది. ఇదే కాకుండా మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానం కలిగించేందుకు ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చేతన్ తన ఫోన్ లొకేషన్ దాచేందుకు వేరే వ్యక్తి మొబైల్ తీసుకుని హత్య ప్రదేశానికి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పిచ్చిగా ప్రేమించిన కేతన్..
సియాను కేతన్ పిచ్చిగా ప్రేమించినట్లు తెలుస్తోంది. సియా పేరును వీపుపై కేతన్ టాటూ వేయించకున్నాడు. సియా పుట్టిన రోజున ఆమెకు సర్ప్రైజ్ చేసేందుకు ఈ టాటూ వేయించుకున్నట్లు తేలింది. దీనికి సంబంధించిన తాజా వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం చేతన్, సియా, రితేష్ హాంగే నిందితులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!