Dussehra Rally: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేనేతృత్వంలోని శివసేనకు బాంబే హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీని నిర్వహించేందుకు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఈరోజు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి దావాపై వివాదం పరిష్కారమయ్యే వరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవద్దని షిండే వర్గం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ముంబై పోలీసులు లేవనెత్తిన శాంతిభద్రతల ఆందోళనల…