దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు సజీవదహనం అయ్యారు. సదర్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: AP Pensions: రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి సిద్ధమవుతున్న ఏపీ సర్కార్..
ఉత్తర ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్లోర్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో బయటకొచ్చే మార్గం లేక ఇద్దరు బాలికలు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. 14 ఏళ్ల గులాష్న, 12 ఏళ్ల అనయ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూడా తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: భర్త మేనకోడలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న భార్య..
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మంటలు అంటుకోగానే బాత్రూమ్‌లో ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తోంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. సంఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఒకే సారి ఇద్దరు బాలికలు మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Delhi | Two girls died after a house caught fire in Delhi's Sadar Bazar area; fire has been brought under control: Delhi Police
(Source: Delhi Fire Service) https://t.co/FYZ7kQ7jhO pic.twitter.com/o6DShNWCa3
— ANI (@ANI) April 2, 2024